వ్యాక్సిన్ వల్లే సడన్ హార్ట్ ఎటాక్ లు.. అధ్యయనం జరుగుతుందన్న మంత్రి?
ఈ క్రమంలోనే ధైర్యంగా ప్రాణాంతకమైన వైరస్ ని ఎదుర్కోవడంతో ప్రస్తుతం దేశంలో ఈ వైరస్ ప్రభావం తగ్గింది. ఈ క్రమంలోని ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతూ ఉన్నాయి. ఇక అందరూ ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. కానీ ఇలాంటి సమయంలో సడన్ హార్ట్ ఎటాక్లు ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి అని చెప్పాలి అయితే కరోనా వైరస్కు ముందు ఇలాంటి సడన్ హార్ట్ ఎటాక్ లు ఎక్కడా లేవు. ఒకవేళ హార్ట్ ఎటాక్ తో చనిపోయిన ఎక్కడో ఒకరు మాత్రమే ఇలా ప్రాణాలు కోల్పోయేవారు. కానీ ఇప్పుడు చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు సడన్ హార్ట్ ఎటాక్లతోనే చూస్తూ చూస్తుండగా ప్రాణాలు కోల్పోతున్నారు.
అయితే కరోన వైరస్ వ్యాక్సిన్ కారణంగానే ఇలా సడన్ హార్ట్ టాకులు వస్తున్నాయి అంటూ ఒక ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. ఇక ఇదే విషయం గురించి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. కోవిడ్ తర్వాత యువతలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయని.. అయితే దీనికి గల కారణాలను నిర్ధారించడానికి ఆధారాలు లేవు అంటూ కేంద్రమంత్రి మన్సుక్ మాండవిగా తెలిపారు. దీనిపై వాస్తవాలు తెలుసుకోవడానికి.. ఐసిఎంఆర్ అధ్యయనాలు మొదలుపెట్టిందంటూ చెప్పుకొచ్చారూ. 2022 నుంచి 18 నుంచి 40 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వారి గుండెపోటు ఘటనల్లో కోవిడ్ టీకా ప్రభావాన్ని గుర్తించేందుకు 30 క్లినికల్ ఆసుపత్రిలో మల్టీసెంట్రిక్ అధ్యయనం జరుగుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.