భార్యకు తనపై ఉన్న ప్రేమను తెలుసుకునేందుకు వింత పరీక్ష.. చివరికి?
ఇలా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కరువై ఒకరి పట్ల ఒకరు దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి కూడా తనపై భార్యకు ఉన్న ప్రేమను తెలుసుకోవాలనుకుని ఆమెకు వింత పరీక్ష పెట్టాడు. చివరికి ఆమె చెప్పిన సమాధానంతో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయ్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బండాలోని కొత్వాన్ని పరిధిలో జరిగింది. అర్థములి గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నిజాముద్దీన్ అనే వ్యక్తి రిజ్వానతో కలిసి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇక వీధి సంసారం సాఫీగానే సాగుతుంది. భర్తకు వచ్చిన సందేహం వల్ల అసలు సమస్య ఏర్పడింది.
భార్యాభర్తలు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా.. భర్తకు ఉన్నట్లుండి ఒక సందేహం వచ్చింది. నా మీద నీకు ప్రేమ ఉందా.. ఒకవేళ నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావా అని భార్యని అడిగాను. నీకోసం నేను ప్రాణం ఇవ్వడానికి సిద్ధమే అని భర్తకు బదిలు ఇచ్చింది భార్య దీంతో నిజాముద్దీన్ వెంటనే విషం తాగాడు. భర్త చేసిన పనికి షాక్ అయినా భార్య తాను కూడా విషం తాగింది. ఇద్దరు తీవ్ర స్వస్థతకు గురయ్యారు. చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దంపతులిద్దరి పరిస్థితి కూడా ఎంతో విషమంగా ఉంది అన్నది తెలుస్తుంది. కాగా అసలు విషయం తెలిసి స్థానికులందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.