హనీమూన్ కు తీసుకెళ్ళమన్న భార్య.. అతనేం చేశాడో తెలుసా?
అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు. ఇక బంధుమిత్రులందరి మధ్య అతని పెళ్లి ఘనంగానే జరిగింది. కానీ పెళ్లి తర్వాత అతని భార్య కోరిన కోరిక చివరికి అతనికి ఊహించని తంటాలను తెచ్చిపెట్టింది హనీమూన్ కు వెళ్దాము అని భార్య కోరింది. అయితే భార్య కోరికను అతను కాదనలేకపోయాడు. కానీ హనీమూన్ కు వెళ్లేందుకు డబ్బు లేవు. దీంతో ఏం చేయాలో అని ఆలోచిస్తే అతని మనసులో ఒక ఆలోచన తట్టింది. చోరీ చేస్తే వచ్చిన డబ్బుతో హనీమూన్కి వెళ్ళాలి అని అనుకున్నాడు. దీంతో తన చేతివాటం ఏంటో చూపించాడు.
కానీ చివరికి పోలీసులకు దొరికిపోయి కటకటాల వెనకకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ లో వెలుగు చూసింది. హసీం అనే వ్యక్తికి జనవరిలో పెళ్లయింది. అయితే మనాలికి హనీమూన్ తీసుకెళ్తానని భార్యకు ప్రామిస్ చేశాడు. అయితే డబ్బులు లేకపోవడంతో ఆగిపోయాడు. కానీ భార్య హనీమూన్ కోసం పదే పదే ఒత్తిడి చేయడంతో ఇటీవలే జూన్ మూడవ తేదీన బుల్లెట్ బైక్ దొంగలించాడు. ఆ తర్వాత మరుసటిరోజే 1.9 లక్షల నగదున్న బ్యాగ్ ని ఎత్తుకెళ్లాడు. కానీ సీసీటీవీ కెమెరాల సహాయంతో ఆ దంపతులు మనాలి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. ఇక వారు ట్రిప్ ముగించుకుని రాగానే వారి వద్ద నుంచి బుల్లెట్ బైక్ తో పాటు 45 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.