భార్యను హత్య చేశాడని జైలుకు వెళ్ళాడు.. కానీ తిరిగొచ్చేసరికి?
ఇక ఇలాంటి ఘటనలను చూసినప్పుడు నిజజీవితంలో మాత్రం ఇలాంటి తరహా ఘటనలు జరగవు అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా సినిమాను మించిన ఘటన జరిగింది అని చెప్పాలి. ఏకంగా భార్యను దారుణంగా హత్య చేశాడు అన్న ఆరోపణలతో భర్త జైలుకు వెళ్ళాడు. ఎన్నో రోజులు పాటు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత మళ్లీ తిరిగి విడుదలై ఇంటికి చేరుకున్నడు. కానీ ఇంటికి వచ్చిన భర్తకు షాకింగ్ సీన్ కనిపించింది. హత్యకుగురైంది అనుకున్న భార్య కాస్త చివరికి వేరొక వ్యక్తితో రాసలీలలు కొనసాగిస్తూ భర్తకు కనిపించింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. భార్య మారుతి దేవిని హత్య చేశాడు అని ఆరోపణల పై భర్త సోను జైలుకు వెళ్లి 18 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం ఇక బెయిల్ పై బయటకు వచ్చాడు అని చెప్పాలి అయితే హత్యకు గురైంది అనుకున్న భార్య కాస్త మరొకరితో రాసలీలలు గడుపుతూ ఉన్న విషయాన్ని భర్త సోను గమనించాడు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు సోను. ఈ క్రమంలోనే ఆర్తి దేవి కనిపించడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. వెంటనే ఆమెను అరెస్టు చేశారు. అయితే అంతకుముందు ఆర్తి దేవి కనిపించకపోవడంతో భర్త పై కేసు నమోదు అయింది. దీనికి తోడు ఇక గుర్తు తెలియని శవాన్ని ఆర్తి దేవి మృతదేహమే అంటూ ఆమె తండ్రి కూడా అంగీకరించడంతో ఇక సోను పై కేసు నమోదు అయింది.