డబ్బులు కోసం ఏటీఎంకు వెళ్ళాడు.. కానీ తీరా చూస్తే?
ఈ క్రమంలోనే అమాయకపు ప్రజలను బురిడీ కొట్టించి ఖాతాలను కాళీ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా కొత్త తరహా మోసాలకు పాల్పడుతూ ఇక పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నారు ఇటీవల కాలంలో ఏటీఎం సెంటర్లలో సైబర్ నేరగాళ్లు ఒక చీప్ అమర్చి ఖాతాలను కాళీ చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఏటీఎం కార్డు మెషిన్ లోని ఇరుక్కుపోయింది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోని ఆ వ్యక్తి అకౌంట్లో ఉన్న నగదు మొత్తం మాయమైంది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది అని చెప్పాలి. ఏకంగా యూపీలో ఉండే ఆరుగురు ముఠా సభ్యులు ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేసి ఏకంగా ఎక్కువ జనాలు వచ్చే ఏటీఎంలనే టార్గెట్ గా చేసుకొని ఏటీఎం కార్డును లోపలికి పెట్టే ప్రాంతంలో ఫెవిక్విక్ రాసి వెళ్ళిపోతారు. ఇక ఏటీఎం వచ్చి కార్డులో డబ్బులు డ్రా చేయాలనే వచ్చిన వ్యక్తి అందులో కార్డు ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు ముఠా సభ్యుడు లోపలికి వచ్చి కార్డు సరిగ్గా పెట్టారా పిన్కోడ్ సరిగా సెట్ చేశారా లాంటి ప్రశ్నలు వేసి అన్ని విషయాలు తెలుసుకుని చివరికి ఖాతాలు ఖాళీ చేస్తారు. ఇక్కడ ఒక వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.