ఈతకు వెళ్లిన ఆర్మీ జవాన్లు.. చివరికి?
ఎన్నో కుటుంబాలను అరణ్యరోధనలో మునిగిపోయేలా చేస్తూ ఉంటాయ్ అన్న విషయం తెలిసిందే. కేవలం నిమిషాల వ్యవధిలో అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోతూ ఎంతోమంది మృత్యువాత పడుతూ ఉంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు నిజంగా మనుషులు దేవుడు చేతిలో కీలుబొమ్మలు మాత్రమే అని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో రెండు ఆర్మీ కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.
దేశానికి రక్షణ కల్పిస్తారు అనుకున్న ఇద్దరు యువకులు కూడా ఊహించిన విధం గా ప్రాణాలు కోల్పోయారు. బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామం లోని చెక్ డ్యామ్ లో ఈతకు వెళ్లారు ఇద్దరు ఆర్మీ జవాన్లు. ఈ క్రమం లోనే నీట మునిగి గల్లంతయ్యారు. దీంతో స్థానికులు ఎంత గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత చాలా రేపటికి కర్నాటి రామచంద్రారెడ్డి మృతదేహం లభ్యమైనది. అయితే మరో వ్యక్తి శివకోటిరెడ్డి మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఇక చెక్ డాం వద్ద ఇరు కుటుంబాల రోధనలు మిన్నంటాయి అని చెప్పాలి.