జ్యోతిష్యుడు చెప్పాడని.. పాము ముందు నాలుక చాచాడు.. చివరికి?
ఇక ఇటీవలే తమిళనాడులో ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా జ్యోతిష్యుడు ఇచ్చిన సలహా విని విషపూరితమైన నాగుపాము ముందు ఏకంగా నాలుక చాచాడు ఒక వ్యక్తి. దీంతో ఆ పాము ఊరుకుంటుందా ఏకంగా అతని నాలుగు పై కాటు వేసింది. దీంతో అక్కడే ఉన్న జ్యోతిష్యుడు సదరు వ్యక్తి నాలుక కోసేసాడు అని చెప్పాలి.. ఈ ఘటన ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పాలి. కోపిశెట్టి పాలాయంకు చెందిన 54 ఏళ్ల రాజా అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే అతనికి పాము కాటు వేసినట్లుగా గత కొన్ని రోజుల నుంచి తరచూ కలలు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఒక జ్యోతిష్యుడిని కలిశాడు. అయితే పాముల ఆలయానికి వెళ్లి పూజలు చేయాలని ఆ జ్యోతిష్యుడు సూచించాడు. అంతేకాకుండా ఒక నాగుపాము ముందు ఇక పాము లాగానే మూడుసార్లు నాలుకను బయటికి చాచాలి అంటూ ఒక పిచ్చి సలహా ఇచ్చాడు. అయితే జ్యోతిష్యుడు సలహాని తూచా తప్పకుండా పాటించిన రాజ పాము ముందు తన నాలుకను మూడుసార్లు బయటకు చాచాడు. దీంతో విష సర్పం అతని నాలుకపై కాటు వేసింది. దీంతో అక్కడే ఉన్న పూజారి ఇది గమనించి అతని నాలుకను కోసేసాడు. ఇక వెంటనే తెగిపోయిన నాలుకను పట్టుకుని ఆసుపత్రికి పరిగెత్తుగా చివరికి కుట్లు వేసి నాలుకను అతికించారు వైద్యులు.