అత్త క్షుద్రపూజలు.. చివరికి కోడలిని?
జూలూరు లో అనూష అనే 30 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే అత్తా క్షుద్ర పూజలు చేసిన నర బలి ఇవ్వడం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్తులు అందరూ కూడా అనుమానం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎస్ లింగోటం గ్రామానికి చెందిన అనూష జూలూరు కు చెందిన బాబురావు తో 2017 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు. బాబురావు విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ భార్యను కొడుతూ వేధిస్తూ ఉండేవాడు.
అయితే గత వారం రోజులుగా అమ్మ తల్లి సోకి అనారోగ్యంతో బాధ పడుతుంది అనూష. ఈ క్రమంలోనే బాబు రావు తన భార్య కి విషమంగా ఉందని బావమరిదికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. అతను వచ్చేసరికి గదిలో మృతి చెందింది అనూష. అయితే అనూషక అత్త క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక అమావాస్య కావడం అనూష మృతదేహం పక్క నిమ్మకాయలు కొబ్బరికాయలు ఉండడం చూసి ఇది అత్త పనే అని అందరూ నిర్ధారించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఇది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భర్త ఆమె ఒంటిపై యాసిడ్ పోసినట్లు స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.