మతిస్థిమితం లేదు.. వంట నూనెకు బదులు పురుగుల మందు వేసింది.. చివరికి?
వంటనూనె అనుకొని చివరికి పురుగుల మందు వేసి కూరలు చేసింది. వాటిని తాను తినడమే కాదు కుటుంబ సభ్యులకు కూడా ప్రేమగా వడ్డించింది. దీంతో ఆ వంటలు తిన్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషమంగా మారడంతో చివరికి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మేడిద పల్లి కి చెందిన బండ్ల నాగమ్మ, పుల్లయ్య దంపతులు గ్రామంలో నివాసముంటూ వ్యవసాయం చూసుకుంటున్నారు. గత కొంత కాలం నుంచి నాగమ్మా మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతుంది.
అయినప్పటికీ భర్తకు సహాయం గా ఉంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంది. అయితే అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేది. ఇక ఇటీవల రోజు లాగానే వంట చేసింది. ఈ క్రమంలోనే వంట నూనె కు బదులు పురుగుల మందు వేసి కూర వండింది. అదే వంటకాలతో తిని పొలం పనులకు వెళ్ళాడు భర్త. ఆమె కూడా భోజనం చేసింది. అయితే కూతురు మాత్రం ఏదో వింత వాసన రావడంతో ఆ భోజనం తినలేదు. మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య అవేమీ పట్టించుకోకుండా ఆహారం తిన్నాడు. దీంతో వెంటనే నాగమ్మ పుల్లయ్య అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు స్థానికులు. కాగా నాగమ్మ మృతిచెందగా పుల్లయ్య ఇంకా ఆస్పత్రి లోనే ఉన్నాడు.