ప్రేమ పెళ్లి.. కానీ భర్త ఆత్మహత్య.. కారణం?

praveen
నేటి రోజుల్లో భార్య భర్తల బంధం అనేది ప్రాణాలు తీయడానికి లేదా ప్రాణాలు తీసుకోవడానికి చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే . మూడుముళ్ల బంధంతో ఏడు అడుగులు నడిచి దాంపత్య బంధం లో అడుగుపెట్టిన భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండలేకపోతున్నారు. అడ్జస్ట్ అయ్యి బ్రతక లేక పోతున్నారు. ఇద్దరు నేనంటే నేను గొప్ప అంటూ మనస్పర్థలకు కారణమవుతున్నారు. చివరికి చిన్న చిన్న మనస్పర్ధలనే పెద్దదిగా చేసుకుని ఇక చేజేతులారా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. దీంతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా కట్టుకున్న వారిని హత్య చేయడం లాంటివి కూడా చేస్తున్నారు.


 ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ కూడా ఇలాంటి తరహా వెలుగు చూసింది. మద్యానికి అలవాటు పడి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసాడు భర్త. ఈ క్రమంలోనే మద్యం తాగొద్దు అంటూ భార్య చెప్పడంతో ఆమెను తిట్టాడు. దీంతో భర్త తీరుతో విసిగి పోయి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చింతల దిన్నె గ్రామానికి చెందిన భీమప్ప సత్తమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.


 నార్సింగ్ లో ఉంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ దంపతులు. ఇటీవలే మద్యానికి బానిస గా మారి పోయిన బీమప్ప భార్యను వేధించడం మొదలు పెట్టాడు. విసిగిపోయిన భార్య ఇటీవలే నార్సింగి లోని తన సోదరుడు ఇంటికి వెళ్ళింది. ఇక అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లి పోయింది. ఇక భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందాడు  భీమప్ప. దీంతో అవుటర్ రింగ్ రోడ్డు మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: