ఇంట్లో ఒంటరిగా మహిళ.. పక్కా ప్లాన్ తో లోపలికి ముగ్గురు.. చివరికి ట్విస్ట్?

praveen
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి సంఘటనల హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓ మహిళా ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇక ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు వ్యక్తులు పక్కా ప్లాన్ ప్రకారమే మాయ మాటలతో నమ్మించి కార్పొరేట్ ఉద్యోగులం అంటూ చెప్పి సదరు మహిళ ఇంట్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగానే జరుగుతుంది అని భావించారు. కానీ కాసేపటికే వారి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగిలింది. దీంతో ఇక ఇంట్లోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడినుంచి పరుగో పరుగు అంటూ పారిపోయారు.

 గుజరాత్ లోని అదజన్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సికే బిల్లా సొసైటీలో జీగ్యాస తేజస్ అనే మహిళ ఒంటరిగా నివాసం ఉంటుంది. అయితే ఆమె ఇంటికి ఇటీవలే ముగ్గురు వ్యక్తులు కార్పొరేట్ ఉద్యోగులు అంటూ నమ్మించి వచ్చారు. మీ వాటర్ ట్యాంక్ తనిఖీ చేయాలి అంటూ మాయ మాటలు చెప్పారు. ముగ్గురు వ్యక్తులు కూడా కార్పొరేట్ ఉద్యోగుల లాగానే డ్రెస్సింగ్ చేసుకోవడంతో వారిని లోపలికి ఆహ్వానించింది సదరు మహిళ. ఇక వాటర్ ట్యాంక్ చుట్టూ పరిసరాలు గమనిస్తున్న సమయంలోనే ఆమెకు క్లోరోఫామ్ ఇచ్చారు.

 అయితే సదరు మహిళ కంగారు పడి పోకుండా ఎంతో తెలివిగా మూర్చపోయినట్లు నటించింది. ఇక మహిళను అక్కడే వదిలేసి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయా అని వెతకడం ప్రారంభించారు ఆ ముగ్గురు వ్యక్తులు. ఇదే అదునుగా భావించి బయటికి పరుగులు తీసింది సదరు మహిళ.ఇంట్లో దొంగలు పడ్డారు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఇంకేముంది దొంగల మైండ్ బ్లాక్ అయింది. ఇక ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా ఇంట్లో నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: