వీళ్ళు అసలు మనుషులా.. మృగాలా..దారుణం..

Satvika
ఈ మధ్య మైనర్ బాలికల పై దారుణాలు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. వయస్సు వచ్చిందని వాళ్ళకు వాళ్ళే అనుకొని అమ్మాయిల పై కూరంగా ప్రవర్థిస్తున్నారు.మైనర్ల పై ఎన్నో ఘటనలు జరుగుథున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు మరో ఘటన జనాలకు కొపాన్ని తెప్పిస్తుంది. పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయిని బర్త్ డే పార్టీ అని పిలిచి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం తమిళ్ నాడులో వెలుగు చూసింది.

వివరాల్లొకి వెళితే..స్కూల్లో చదువుతున్న బాలికను బర్త్‌డే పార్టీకి ఆహ్వానించి ఆపై ముగ్గురు సహ విద్యార్ధులు ఆ బాలిక పై సామూహిక అత్యాచారాని కి పాల్పడ్డారు.ఈ ఘటన తమిళనాడు లోని కడలూర్ జిల్లాలో కలకలం రేపింది. ఈ దారుణ ఘటనలో ముగ్గురు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.కడలూర్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న బాలిక (15) ను అదే స్కూల్‌ లో పన్నెండో తరగతి చదివే విద్యార్ధి తన పుట్టిన రోజు పార్టీకి ఆహ్వానించారు.

పార్టీకి వచ్చిన బాలికను ఏదో మాట్లాడాలంటూ పదో తరగతి చదివే విద్యార్ధి వేరే గదిలోకి తీసుకువెళ్లాడు. ఆ గదిలోకి మరో ఇద్దరు స్నేహితులను పిలిచి ఆపై గది తలుపులు మూసివేసి సామూహిక అత్యాచారాని కి పాల్పడ్డారు.ఈ బాలికపై జరిగిన దారుణాన్ని వీరు వీడియోలో రికార్డు చేశారు. అదే స్కూల్‌ కు చెందిన విద్యార్ధులకు ఆ వీడియోను చేరవేశారు. ఘటన అనంతరం బాలిక స్కూల్‌ కు వెళ్లేందుకు నిరాకరించడం తో ప్రశ్నించిన తల్లికి జరిగిన విషయం చెప్పడం తో ఈ దారుణం వెలుగు చూసింది. కుటుంబ సభ్యులతో కలిసి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది... ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: