మందుబాబులకు గుడ్ న్యూస్..అమాంతం పడిపోయిన బీర్ల ధరలు..

Satvika
వీకెండ్ వస్తే బీరు తాగాలని చాలా మంది అనుకుంటారు.. అయితే సమ్మర్ కారణంగా బీర్ల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే..అయితే ఇప్పుడు బీర్ల ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.పంజాబ్ రాష్ట్రం మద్యం బాబులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.పంజాబ్‌లోని ఆమ్ఆద్మీ సర్కార్‌ సరికొత్త ఎక్సైజ్ పాలసీ 2022-23ని విడుదల చేసింది..సంబంధించిన ప్రతిపాదనలను పంజాబ్ క్యాబినెట్ ఆమోదించింది, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 40 శాతం అధికంగాఆమోదించింది. జులై 1వ తేదీ నుంచి ఈ సరికొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ముఖ్యంగా 35 నుంచి 60 శాతం వరకు ధరలను తగ్గించేలా సరికొత్త మద్యం పాలసీని ప్రకటించింది.


ఈ కొత్త విధానం వల్ల 2021-22లో రూ.6,158 కోట్ల ఆదాయం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,647.85 కోట్లకు చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారథ్యంలోని ఆప్‌ సర్కార్‌ మద్యం పాలసీని తీసుకురావడమేకాదు, కొన్నినిర్మాణాత్మక చర్యలను ప్రతిపాదించింది. లాట్ల ద్వారా మద్యం విక్రయాలను కేటాయించే బదులు, టెండర్లను ఆహ్వానించడంద్వారా వేలం వేయనుంది..

డిస్టిల్లర్లు, మద్యం పంపిణీదారులు, మద్యం రిటైలర్లు డీలింక్ చేయనుంది.



అంతేకాదు రాష్ట్రంలో కొత్త డిస్టిలరీల ప్రారంభంపై నిషేధాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. పంజాబ్ మీడియం లిక్కర్ మినహా అన్ని రకాల మద్యంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం వసూలు చేయనుంది. హర్యానా నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. మద్యం ధరల తగ్గుదలతో ఎక్సైజ్ ఆదాయాన్ని 40 శాతం పెంచుకోవాలని భావిస్తోంది.ఈ పాలసి అనేది తొమ్మిది నెలల పాటు ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉంటుంది.కొన్ని బ్రాండ్‌ల ధరలు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా వాడే ఇండియన్ ఐఎంఎఫ్‌ఎల్‌ ధర కూడా భారీగా తగ్గనుంది.ఇది మందు బాబులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: