తల్లి ఫోన్ లాక్కుందని.. బాలుడు ఏం చేసాడో తెలుసా?

praveen
ప్రస్తుతం ప్రతి ఒక్కరు టెక్నాలజీని ఎంత బాగా ఉపయోగించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం కావాలన్నా ఇంట్లో కూర్చుని హాయిగా కాలు మీద కాలు వేసుకొని కావాల్సిన పనులు చేసుకుంటున్నారు. అలా పెరిగి పోయిన టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. అదే సమయంలో టెక్నాలజీ పెరిగిపోవడం నేటి రోజుల్లో ఎన్నో ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది. అదేంటి టెక్నాలజీ పెరిగిపోవడానికి ప్రాణాలు పోవడానికి ఏమైనా సంబంధం ఉందా అని అనుకుంటున్నారు కదా. పూర్తి విషయం తెలిసిన తర్వాత మాత్రం ఇది నిజమే అని అంటారు మీరు కూడా.

 ఒకప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే హాయిగా స్నేహితులతో ఆడుకోడానికి మైదానం కు వెళ్లేవారు అందరూ. కానీ ఇప్పుడు మాత్రం టెక్నాలజీ వల్ల ఆన్లైన్ గేమ్స్ అందుబాటులోకి రావడంతో కూర్చున్నచోట నుంచి కదలకుండానే అన్ని గేమ్స్ మొబైల్లో ఆడేస్తున్నారు ఆన్లైన్ గేమ్స్ కి బానిసలుగా మారి పోతూ చివరికి తల్లిదండ్రులు మందలించడంతో ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది అని చెప్పాలి. కొడుకు తరచు ఫోన్ వాడుతున్నాడు అన్న కారణంతో ఫోన్ లాక్కుంది తల్లి. దీంతో 16 ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని ముంబైలో వెలుగులోకి వచ్చింది. బాలుడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న సందర్భంలో తల్లి ఫోన్ తీసుకొని ముందు చదువుపై దృష్టి పెట్టాలి అంటూ మందలించింది. ఈ క్రమంలోనే కోపానికి గురైన బాలుడు సూసైడ్ నోట్ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. బలవన్మరణానికి పాల్పడటానికి ఒక ఇంటి నుంచి వెళ్తున్నాను అంటూ ఆ లేఖలో రాసి ఉంది. ఎప్పటికి ఇంటికి తిరిగి రాను అంటూ లేఖలో పేర్కొన్నాడు. ఇటీవలే రైలు పట్టాలపై మృతదేహం లభించగా అది ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడిదే అని పోలీసులు నిర్ధారించుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: