కడుపు నొప్పితో ఆస్పత్రికి మహిళ.. స్కాన్ చేసి చూసి డాక్టర్లు షాక్?

praveen
సాధారణం గా డాక్టర్లు అన్న తర్వాత ఎప్పుడు ఎన్నో రకాల కేసులు వాళ్ల దగ్గరికి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని రకాల కేసులు  డాక్టర్లనే అవాక్కయ్యే విధంగా చేస్తూ ఉంటాయ్. ఇక్కడ డాక్టర్లకు ఊహించని షాక్ ఇచ్చిన ఒక కేస్ సంబంధించిన వార్త కాస్త వైరల్ మారి పోయింది. ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతుంది. ఈ క్రమం లోనే మొదట  నొప్పిని పెద్దగా పట్టించు కోలేదు. ఇంట్లోనే ఏదో ఒక వైద్యం చేసుకుంటూ వచ్చింది.  కానీ కడుపు నొప్పి తీవ్రం కావడం తో చివరకు చేసేదేమీలేక స్థానికం గా ఉన్న ఆసుపత్రికి వెళ్ళింది.


 ఈ క్రమం లోనే సదరు మహిళకు ఎందుకు కడుపు నొప్పి వస్తుందా అని తెలుసు కోవడానికి ఆమెకు స్కానింగ్ నిర్వహించారు. ఆ తర్వాత వచ్చిన రిపోర్టులను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు అని చెప్పాలి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. హీరా షేక్ అనే మహిళ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుంది. మొదట్లో కేవలం టాబ్లెట్ వేసుకొని నొప్పిని తగ్గించుకునేందుకు ప్రయత్నించింది. కడుపు నొప్పి తీవ్రం కావడంతో చివరి హాస్పిటల్ కి  వెళ్ళింది. కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు డాక్టర్లు.

 డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి 100 గ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ప్రస్తుతం సదరు మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు వైద్యులు. ఈ ఘటన కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ శస్త్రచికిత్సకు హర్ట్ మ్యాన్ ఆపరేషన్ ఆపరేషన్ గా డాక్టర్లు నామకరణం చేయడం గమనార్హం. అది సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం కారణంగా అంతేకాకుండా పరిశుభ్రమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలా ప్లాస్టిక్ పదార్ధాలు సదరు మహిళ కడుపులో పేరుకుపోయాయి అంటూ డాక్టర్లు చెబుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: