పబ్ లో దారుణం..కనికరం లేకుండా దాడి..
హైదరాబాద్ లో పబ్స్ లలో దారుణాలు ఆగడం లేదు. అశ్లీల నృత్యాలు , డ్రగ్స్ వాడకం వంటివి విపరీతంగా జరుగుతుంది. అర్ధరాత్రి వరకు పీకల్లోతు వరకు తాగడం..ఆ తర్వాత డ్రైవ్ చేస్తూ ప్రమాదాలు చేయడం అలవాటు అయిపోయింది.తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పార్టీ పేరుతో మైనర్ బాలిక ను తీసుకొచ్చి , ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేసిన ఘటన జూబ్లీ హిల్స్ లో అమ్నేషియా పబ్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అమ్నేషియా పబ్ కు సూరజ్, హాడీ అనే వ్యక్తులు మైనర్ బాలికను పార్టీ పేరుతో పబ్ కు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి స్పృహ కోల్పోయిన తర్వాత బాలికపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన గత నెల 28న జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీ కెమెరా లను పరిశీలిస్తున్నారు పోలీసులు. రెండు బీఎండబ్ల్యూ కార్లలో మైనర్ బాలికను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యాని కి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా మైనర్ బాలిక ను పబ్ లోకి ఎలా అనుమతించారని పబ్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు...ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు..