దారుణం : కట్టుకున్న భార్యపై.. భర్తే అత్యాచారం చేయించాడు?

praveen
భర్త అంటే భార్యకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాలి భర్త.. అంతేకాదు ఇక ఎవరైనా పరాయి మగాళ్లు భార్య గురించి చెడుగా మాట్లాడితే చీల్చి చెండాడతాడు. ఇలా భర్త అంటే భార్యకు అనుక్షణం రక్షణగా నిలవాలి. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతో మంది కట్టుకున్న భార్య విషయంలోనే కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మూడు ముళ్ల బంధానికి విలువ ఇవ్వకుండా భార్యలను రోడ్డు పాలు చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.  ఇటీవలి కాలంలో సభ్యసమాజంలో అత్యాచారాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఇంట్లో ఉన్న ఆడ పిల్లలకు ఎలాంటి ఆపాయం జరగకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు.



 కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం ఏకంగా కట్టుకున్న భార్య పైన అత్యాచారం చేయించాడు. సభ్య సమాజం నుంచి రక్షణ కల్పించాల్సిన భర్త చివరికి కొంత భార్యకే సమస్య గా మారిపోయాడు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది ఈ అమానవీయ ఘటన. నీలాంగా ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ భర్తతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో ఉంటుంది. ఇటీవలే సదరు వివాహిత భర్తతో గొడవపడింది. ఈ క్రమంలోనే భర్తపై అలిగి లాతూర్ లో ఉన్న తన పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలోనే భార్య భర్తల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణమని.. సర్దుకుపోతూ భర్తతో కలిసి బ్రతకాలని ఇక సదరు వివాహితకు చెప్పిన తల్లి ఆమెను పొలం వద్ద దిగబెట్టి వెళ్ళిపోయింది.



 ఈ క్రమంలోనే మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయాడు భర్త. వెనుకా ముందూ ఆలోచించకుండా దారుణంగా ప్రవర్తించాడు. పొలం యజమాని అతడి సోదరుడు ని పిలిపించి కట్టుకున్న భార్య పైన అత్యాచారం చేయించాడు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ అయిన సదరు మహిళ వదిలి పెట్టాలి అంటు ఎంత ప్రాధేయపడినా ఆ భర్త కనికరించలేదు. ఈ క్రమంలోనే కామాంధుల బారి నుంచి తప్పించుకున్న సదరు మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: