ఒక్కసారిగా కూలిన బిల్డింగ్.. చివరికి?

praveen
దేవుడు చేతిలో మనిషి జీవితం కీలుబొమ్మ లాంటిది అని చెబుతూ ఉంటారూ. దేవుడు ఎలా అడిస్తే మనిషి తన జీవితంలో అలా ఆడుతూ ఉంటాడు అని అంటూ ఉంటారు.  ఎన్ని రోజుల వరకు ప్రాణాలతో ఉండాలి అన్నది కూడా దేవుడే నిర్ణయిస్తాడు అని చెబుతూ వుంటారు చాలామంది. ఇవన్నీ విన్న తర్వాత ట్రాష్ అని కొట్టి పారేస్తూ ఉంటారు కొంతమంది. కానీ కొన్ని కొన్ని సార్లు అనుకోని విధంగా మృత్యువు దరిచేరడం తో నిజంగానే మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిది అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోని సంఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటాయి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని తెలుస్తోంది.. ఏకంగా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఏకంగా నిర్మాణంలో ఉన్న ఒక భవనం విరిగిపోయింది. దీంతో ఆ భవనం శిథిలాల కింద చిక్కుకుని ఏకంగా ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషాదకర ఘటన అమరావతిలో వెలుగులోకి వచ్చింది. ఇక ఆ భవనం శిథిలాల కింద మరో ముగ్గురు కార్మికులు కూడా ఉన్నారు అనేది తెలుస్తుంది. రాడ్ బెండింగ్ వర్క్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని.. అయితే కొంత మంది కార్మికులు ప్రమాదం జరుగుతుందని ముందుగానే గ్రహించి ఇక సురక్షితంగా అక్కడి నుంచి బయట పడటం గమనార్హం. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 ఇక శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీయడమే కాదు ఇక గాయాలతో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనలో చనిపోయిన వారు బీహార్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన కూలీలు గా గుర్తించారు పోలీసులు. నగర నడిబొడ్డున జరుగుతున్న ఈ మల్టీ కాంప్లెక్స్ కు అనుమతులు లేవని అనుమతి లేకుండా భవన నిర్మాణం జరుగుతుంది అంటూ అటు అధికారులు చదువుతూ ఉండటం గమనార్హం. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక చనిపోయిన వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తామని మేయర్ చెప్పుకొచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: