రెప్పపాటు క్షణంలో తప్పిన ప్రమాదం... లేదంటే?

VAMSI
రైల్వే గేట్ దగ్గర చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొందరు కావాలని తమ ప్రాణాలను తీసుకుంటే మరి కొందరు అనాలోచితంగా చేసే పనుల వలన తమ ప్రాణాలను యాక్సిడెంటల్ గా కోల్పోతున్నారు. కాలం ఎంతో విలువైనది. కానీ ప్రాణం అంతకన్నా విలువైనది. ఈ విషయాన్ని అర్దం చేసుకోకుండా ఎందరో తమ ప్రాణాలను కోల్పోతున్నారు, తమ వారిని దుఃఖసముద్రంలో ముంచి వదిలి వెళుతున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నారు అని తేలికగా తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించండి. కొన్ని సార్లు మనం చేసే చిన్న పొరపాట్లు సమస్యగా మరి మన ప్రాణం మీదకి తీసుకొస్తే. ఇపుడు అలాంటి వార్తే ఒకటి మన ముందుకు వచ్చింది.

అక్కడ ఇక్కడ రైలు పట్టాలు వద్ద వాహనాలు దిగడం కోసం మార్గం ఉంటుంది. అయితే ముందు జాగ్రత్త కోసం  అక్కడ రైల్వే గేట్ వేసి ఉంటారు. రైలు వచ్చే సమయంలో తప్ప మిగిలిన సమయంలో ఆ గేటును తెరిచి ఉంటారు. అలాంటి సమయంలో ప్రజలు ఆ గేటు దాటి అవతలి వైపుకు వెళ్ళవచ్చు. అయితే కొన్ని సార్లు రైల్వే గేటు మూసి ఉన్నప్పటికీ కొందరు ఆ కాసేపు సమయం కూడా వేచి ఉండలేక రైలు వస్తుందా లేదా అన్నది కనీసం గమనించకుండా దాటడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సమయంలో కొందరు  రైల్వే గేటు దాటి మరి కొందరు మాత్రం దురదృష్టవశాత్తూ రైలు ప్రమాదంలో మరణిస్తున్నారు.

తాజాగా ఓ వ్యక్తి రైలు గేటు వేసున్నప్పటికీ త్వరగా వెళ్ళాలనే యోచనతో ఏమాత్రం ఆలోచించకుండా బండిని ఆ గేటు పక్క నుండి వంచి తీసుకుని మధ్యలోకి వచ్చేశాడు దాటుతున్న సమయంలో రైలు వేగంగా వస్తుండటంతో అది గమనించిన అక్కడి జనం పెద్దగా అరిచారు. దాంతో ఆ వ్యక్తి తన మోటారు వాహనాన్ని అక్కడే వదిలి వెనక్కి వెళ్ళిపోయాడు. దాంతో తన ప్రాణాలు దక్కాయి. లేదంటే ఏమై ఉండేది. కేవలం పది పదిహేను నిమిషాలు వెయిట్ చేయలేక అతడు చేసిన సాహసం ప్రాణం మీదకు తీసుకువచ్చింది. ఆ వీడియోని ఇపుడు రైల్వే శాఖ వారు సోషల్ మీడియాలో ఉంచి రైల్వే గేటు మూసి ఉన్నప్పుడు లెవెల్ క్రాసింగ్ ఎందుకు దాటకూడదు అన్నది అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలం కన్నా ప్రాణం మిన్న అన్నది తెలుసుకుని జీవించండి అని ఆ వీడియో తెలియచేస్తోంది. ముందు చూపు అనేది అన్ని వేళల అవసరమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: