మేకను దొంగిలించిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాకే..!

MOHAN BABU
పోలీసులు అంటేనే సమాజంలో శాంతి భద్రతలను, పరిరక్షించే వీరులు. వీరు ఉండడం వల్లనే ఒకరికొకరు భయంతో బ్రతుకు ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి పోలీసులే వక్ర మార్గాన్ని ఎంచుకుంటే ఎలా ఉంటుంది. వినడానికి కూడా మరీ చండాలంగా ఉంటుంది. అలాంటి పోలీసులు  ఈ యొక్క పాడు పని చేశారు. సంవత్సరం ఎండింగ్ రోజు దావత్ కోసమని  ఏకంగా ఒక రైతు మేకను దొంగిలించి 31 దావతు చేసుకున్నారు. మరి ఈ విషయం ఏ విధంగా బయటకు వచ్చింది. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..!


 31 అంటేనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో విందులు, ఎన్నో వినోదాలు, మాంసాహారం మందు పార్టీలు, కేక్ కటింగ్ లు డీజే సౌండ్ లు ఇలా ఎన్నో ఎవరికి నచ్చిన విధంగా వారు సెలబ్రేట్ చేసుకోవడం మనం చూశాం. అయితే అందరిలాగే పోలీసులు కూడా 31 పార్టీ చేసుకుందాం అనుకున్నారు. ఆ విధంగానే ఒక మేకను కోసి మరి గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. మరి ఆ మేక వారు కొనుగోలు చేశారా.. లేదు కోట్టుకొచ్చారు.. అవునండి మీరు విన్నది నిజమే. పోలీసులు దొంగల్లా మరి మేకను కాజేసి పోలీస్ స్టేషన్ దగ్గర్లోనే దాన్ని కోసి విందు పార్టీ చేసుకున్నారు. ఇది ఎక్కడ  అంటే ఒరిస్సా రాష్ట్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన టువంటి విషయం ప్రకారం సిండికేల గ్రామానికి చెందినటువంటి సంకీర్తన గురు అనే వ్యక్తి మేకలను మేపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజులాగే ఆయన 31 వ రోజు మేకలను తోలుకొని ఇంటికి వచ్చాడు. ఆ మందలో రెండు మేకలు కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికాడు. కానీ కనిపించలేదు. అయితే వీరు మేకలను మేపే దగ్గరనే పోలీస్ స్టేషన్ ఉంది. వీరు వెతికే క్రమంలో గురు కూతురు స్టేషన్ లో రెండు మేకల కోస్తుండగా చూసింది.


వెంటనే వెళ్లి వాళ్ళ నాన్నకు చెప్పింది. గురు వారి యొక్క గ్రామస్తులను వెంట తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ సిబ్బందిని నిలదీశారు. మా మేకలను దొంగిలించి కోసుకుంటారా.. అని ప్రశ్నించాడు. కానీ వారు పట్టించుకోలేదు. గురునే బెదిరించారు. ఈ విషయం కాస్త మీడియా దృష్టికి వెళ్లింది. వెంటనే జిల్లా ఎస్పీ నితిన్ శుక్లకర్ స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపించి పోలీసులు తప్పు అని తేల్చారు. ఎస్ఐ సుమన్ మాలిక్ ను సస్పెండ్ కూడా చేశారు. ఈ విషయం  సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రజలు పోలీసులు ఇలా చేస్తే  దొంగలు ఏ విధంగా చేస్తారని కామెంట్ ద్వారా దుమ్మెత్తిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: