బడికెళ్లే బాలుడిలో కామం.. చివరికి?
కానీ ఇటీవలి కాలంలో చూసుకుంటే ఏకంగా స్కూల్ సమయంలోనే ఎంతోమంది విద్యార్థులు పెడదోవ పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బుద్ధిగా చదువుకోవాల్సిన సమయంలో ఏకంగా కామంతో ఊగిపోతున్నారు ఎంతోమంది విద్యార్థులు. చివరికి ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి . ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్ బాలికపై మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. 3,5 వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై 8, 9 వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఇక పక్కనే కొంతమంది స్థానికులు చూసి మందలించడంతో ఇద్దరు బాలురు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే స్థానికులు బాలికల తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.