సంచ‌ల‌న తీర్పుఇచ్చిన తెలంగాణ హై కోర్టు..

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. ఓ కామాంధుని వ‌ల్ల ప‌ద‌హారేండ్ల ఓ మైన‌ర్ బాలిక అవాంచిత గ‌ర్భం దాల్చిందని.. అవాంఛిత గ‌ర్భాన్ని తొల‌గించాల‌ని హైకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. బాలిక‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి గ‌ర్భ‌విచ్ఛితి ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని హైద‌రాబాద్ న‌గ‌రంలోని కోఠి ప్ర‌భుత్వ ప్ర‌సూతి ఆసుప్ర‌తి సూప‌రింటెండెంట్‌ను ఆదేశించింది. ఈ మేర‌కు జ‌స్టీస్ బీ విజ‌య్‌సేన్‌రెడ్డి ఇటీవ‌ల తీర్పు వెల్ల‌డించారు. గ‌ర్భంలోని పిండానికి ఉండే హ‌క్కుల కంటే లైంగిక‌దాడికి గురైన బాలికకు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కులే అత్య‌ధిక ప్రాధాన్య‌త క‌లిగి ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు.
దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితిలో ఏర్ప‌డిన గ‌ర్భాన్ని తొల‌గించేందుకు అనుమ‌తి ఇవ్వ‌క‌పోతే బాలిక మాన‌సికంగానే కాకుండా శారీర‌కంగా కూడా తీవ్ర ఒత్తిడికి గుర‌వుతుంద‌ని వెల్ల‌డించారు.. దీని ఫ‌లితంగా ఆ బాలిక‌క శిశువుకు జ‌న్మ‌నిస్తే భ‌విష్య‌త్‌లో అనేక స‌మ‌స్య‌ల‌తో పాటు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వివ‌రించారు. పుట్ట‌బోయే శిశివుతో పాటు త‌ల్లి కూడా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు. త‌మ కుమార్తె ప్రాణానికి ముప్పు ఉంద‌ని బాలిక త‌ల్లిదండ్రులు కోర్టుకు మొర‌పెట్టుకున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పుట్ట‌బోయే శిశువు జీవితం కంటే బాలిక జీవితం ముఖ్యం. గ‌ర్భాధార‌ణ అనేది ఆ మ‌హిళ ఇష్టం. అవాంఛిత గ‌ర్భం లేదా లైంగిక‌దాడి వ‌ల్ల వ‌చ్చిన గ‌ర్భానికి చ‌ట్ట‌ప్ర‌కారం కొన్ని నిబంధ‌న‌లకు అనుగుణంగా తొల‌గించొచ్చు.  
మ‌హిళ హుందాత‌నం, ఆత్మ‌గౌర‌వం, ఆరోగ్యంగా జీవించేందుకు రాజ్యాంగం హ‌క్కులు క‌ల్పించింది. వీటిని ప‌రిగ‌ణ‌ణ లోకి తీసుకొని బాలిక గ‌ర్భాన్ని తొల‌గించాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేస్తున్నాం అని న్యాయ‌మూర్తి తీర్పు చెప్పారు. ఆ బాలిక బంధువైన ఆంజ‌నేయులు అనే వ్య‌క్తి అత్యాచారం చేయ‌డంతో గ‌ర్భం దాల్చింది. బాలిక‌కు అనారోగ్యంగా ఉంద‌ని త‌ల్లిదండ్రులు సెప్టెంబ‌ర్ 9న కోఠి ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ బాలిక 25 వారాల గ‌ర్భ‌వ‌తి అని వైద్యులు గుర్తించారు. దీంతో త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. చ‌ట్ట‌ప‌ర‌మైన గ‌డువు దాటి గ‌ర్భం తొల‌గింపున‌కు వైద్యులు నిరాక‌రించ‌డంతో బాలిక త‌ల్లిదండ్రులు హైకోర్టులో రిట్ దాఖ‌లు చేశారు. ముగ్గురు వైద్యుల క‌మిటీ నివేదిక‌ను ప‌రిశీలించిన అంత‌రం... సీనియ‌ర్ గైన‌కాల‌జిస్ట్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో 48 గంట‌ల్లో గ‌ర్భ‌విచ్చితి చేయాల‌ని హైకోర్టు  తీర్పు వెల్ల‌డించింది. డీఎన్ఏ ప‌రీక్ష చేసేందుకు వీలుగా పిండ క‌ణ‌జాలాల‌ను, ర‌క్త న‌మూనాల‌ను భ‌ద్ర‌ప‌ర్చాల‌ని కోఠి ఆసుప్ర‌తి సూప‌రింటెండెంట్‌ను ఆదేశించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: