కేటుగాళ్ల మోసానికి 11 లక్షలు పోగొట్టుకున్న వృద్ధ మహిళ....

VAMSI
చాలా కాలం నుండి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. మనము తరచుగా పాత కరెన్సీ నోట్లు మన వద్ద వుంటే లక్షలు ఇస్తామని మీరు ధనవంతులు అవుతారని చెబుతూ ఉంటారు. అయితే అలా ఎవ్వరైనా ధనవంతులు అయ్యారా లేదా అనే విషయం పక్కన పెడితే దీని వలన తాజాగా జరిగిన ఒక సంఘటన డేంజర్ బెల్ ను మోగిస్తోంది. అయితే అసలు ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన అందరినీ మేల్కొనేలా చేసింది. ఈ రాష్ట్రానికి చెందిన 66 సంవత్సరాల ముసలి ఆవిడకి కొంత మంది ఆగంతకులు ఆమెకు సామజిక మాధ్యమం ద్వారా దగ్గరయ్యారు. మీ దగ్గర పాత నాణేలు లేదా నోట్లు వుంటే మీకు లక్షలు ఇస్తామని నమ్మ బలికారు.
అయితే డబ్బులు అంటే ఎవరికైనా ఆదేశ ఉంటుంది కదా అందుకే వారు వేసిన ట్రాప్ లో ముసలావిడ పడిపోయింది. అయితే ఆలా చేసినందుకు మాకు కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని ముందుగానే చెప్పారు. ముందుగా వీరు చెప్పిన ప్రకారం పాత 5 రూపాయలు మరియు 10 రూపాయలు కు బదులుగా 45 లక్షలు మార్చి ఇస్తామని చెప్పారు. ఈ మొత్తానికి గానూ కమిషన్ మరియు జీఎస్టీ ఖర్చులకు 11.45 లక్షల రూపాయలు తమ బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పారు. అయితే వచ్చేది 45 లక్షలు పోయేది 11 .45 లక్షలు మాత్రమే ఇంకా నాకు 33 లక్షలు వస్తాయని ఊహించిన ఆవిడ వెంటనే వారి అకౌంట్ లోకి సదరు మొత్తాన్ని డిపాజిట్ చేసింది.
డిపాజిట్ చేసిన తర్వాత వారి నుండి ఫోన్ కానీ సోషల్ మీడియాలో మెసేజ్ కానీ రాలేదు. దానితో ఆమె మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు అందరికీ ఒక గుణపాఠం లాంటిది. ఊరికే ఎవ్వరూ డబ్బులు ఇవ్వరని గుర్తించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: