మిస్టరీగా మారిన గాంధీ ఘటన.. ఏం జరుగుతోంది..?

MOHAN BABU
 గాంధీ ఆస్పత్రిలో  లైంగిక దాడి  ఘటనలో  పోలీసులు విచారణను చాలా స్పీడ్ ఆఫ్ చేశారు. నిందితులపై 342, 376డీ, 328  సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి టెక్నీషియన్ ఉమామహేశ్వర్ రావుతో పాటు,  మరో  నలుగురు నిందితులను చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారిని అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ యొక్క ఘటనపై  రాష్ట్ర వ్యాప్తంగా  తీవ్రంగా నిరసన వ్యక్తం అవుతోంది. మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్  కూడా స్పందించింది. ఈ కేసులో  నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి  విచారణ చేపడుతున్నారు.. ఇందులో పేషెంట్ నరసింహ భార్య కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లకు  కల్లు తాగే అలవాటు ఉన్నా విషయాన్ని ఉమామహేశ్వర్ పసిగట్టి  వారిని తీసుకెళ్లి, కళ్ళు తాగించి  రేప్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్ ని కూడా  రంగంలోకి దించారు పోలీసులు. ఉమామహేశ్వరరావు స్నేహితులే నరసింహ, అతని భార్యను తీసుకెళ్లి  ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


....అసలు ఉమామహేశ్వరరావు ఎవరు..?


 మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నరసింహ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న డంతో  దూరపు బంధువైన ఉమామహేశ్వరరావును సంప్రదించినట్టు  సమాచారం. అతని సలహాతోనే  ఈ నెల 5వ తేదీన  నరసింహ గాంధీ దవాఖానాలో చేర్పించినట్లు తెలుస్తోంది. అతనికి సహాయకులుగా  ఆయన భార్య మరియు మరదలు వచ్చారు. దూరపు బంధువు కావడంతో  ఉమామహేశ్వరరావును  వారు పూర్తిగా నమ్మారు. అయితే గాంధీ ఆస్పత్రిలో  పేషంట్ దగ్గర ఒక్కరే ఉండాలంటూ అక్కాచెల్లెళ్లను  ఉమామహేశ్వరరావు వేరుచేసినట్టు తెలుస్తోంది. తర్వాత ఉమామహేశ్వరరావు  వారిని తన స్నేహితులతో వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ఆమె చెల్లెకు కర్చిపు ద్వారా మత్తుమందిచ్చి, మత్తుమందు ఇంజక్షన్ కూడా ఇవ్వడంతో  ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు  తెలుస్తోంది. తర్వాత  స్పృహ  కోల్పోయాక  ఆమెపై  ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు, ఆ బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఏది ఏమైనా దేవాలయం లాంటి దవాఖానాల్లో  ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం  రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. గాంధీ దవాఖానకు వెళ్లాలంటేనే  వణుకు పుట్టేలా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో మహేశ్వర్ రావుతో పాటు ఇంకా చాలా మంది పాల్గొన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: