రైలు పట్టాలపై ప్రేమజంట.. చూసి వణికి పోయిన జనం.. అంతలో?

praveen
ప్రేమ.. పలకడానికి రెండే అక్షరాలు అయినప్పటికీ.. ప్రేమలో పడితే బయటికి రావడం మాత్రం చాలా కష్టం. అదేంటో తెలియదు కానీ.. ప్రేమలో పడిన ప్రతి ఒక్కరు కూడా సైనికుడిలా మారిపోతుంటారు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతూ ఉంటారూ. ధైర్యంగా పోరాడి ఇక తమ ప్రేమను గెలిపించుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం మనుషుల్లో ధైర్యం చచ్చి పోయినట్లుంది.  ప్రేమించినప్పుడు ధైర్యంగానే ప్రేమిస్తున్నారు. కానీ ఆ తర్వాత ప్రేమను గెలిపించుకోవడానికి చేసే పోరాటాన్ని మాత్రం చేయడం లేదు.

 దీంతో చిన్నచిన్న కారణాలకే ఎంతోమంది ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక నేటి నాగరిక సమాజంలో కూడా ఎంతోమంది ప్రేమ జంటలకు కులం మతం అనేది ఇంకా అడ్డు వస్తూనే ఉంది. దీంతో జీవితంలో కలిసి లేకపోయినా చావులో అయినా కలిసి బ్రతుకుదాం అని నిర్ణయించుకుంటున్నారు  ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఇటీవల గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారూ.

 ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంకి చెందిన షేక్ ఆదాం అనే యువకుడు మోటార్ మెకానిక్ గా పని చేస్తున్నాడు  అయితే అదే ప్రాంతానికి చెందిన శ్యామలత అనే ఇంటర్ విద్యార్థి తో ప్రేమలో పడ్డాడు షేక్ ఆదాం. ఇద్దరూ కొంత కాలం నుంచి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనీ  భావించి పెద్దలకు వారి ప్రేమ విషయం చెప్పారు. కానీ పెద్దలు మాత్రం ప్రేమకు విలన్ లుగా మారిపోయారు.పెళ్లికి అంగీకరించలేదు  దీంతో జీవితంలో కలిసి బతకలేమని కనీసం చావులో అయినా కలిసి ఉండాలి నిర్ణయించుకొని ఇక వినుకొండ వద్ద రైల్వే ట్రాక్ వద్దకు వచ్చి నిలబడ్డారు. ఇక ఈ ప్రేమ జంటను చూసి స్థానికులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. రైలు వస్తుంది పక్కకు తప్పుకోవాలని విజ్ఞప్తి చేశారు.  అయినప్పటికీ వినని ప్రేమజంట అలాగే నిలబడింది. దీంతో రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: