ఫ్రెండ్సే కదా అని ఫోన్ ఇస్తే.. !
ఇక మరో ఘటనలో స్నేహితురాల్లే శత్రువులు అయ్యారు. తమ స్నేహితురాలు ఫోన్ నుండి వ్యక్తిగత ఫోటోలు వీడియోలు తమ ఫోన్లలోకి ఇద్దరు యువతులు కాపీ చేసుకున్నారు. అనంతరం తాము చెప్పినట్లు వినకపోతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాలప్పడటం మొదలు పెట్టారు. దాంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఓ యువకుడు మొబైల్ యాప్ లో పెట్టుబడుల పేరుతో దారుణంగా మోసపోయాడు. వివరాల్లోకి వెళితే....మొబైల్ యాప్ లో పెట్టుబడులు పేరుతో అవినాష్ కుమార్ అనే వ్యక్తిని కేటుగాళ్లు ట్రాప్ చేశారు.
అవినాశ్ వద్ద మొత్తం రెండు లక్షలు.. అంతే కాకుండా అతని ఏడు మంది స్నేహితుల ద్వారా మరో 10 లక్షలకు పైగా లక్కీ స్టార్، జెన్సిక్ అనే మొబైల్ యాప్స్ లో నిందితులు పెట్టుబడు పెట్టించారు. మొదటగా ఈ యాప్స్ లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని బాధితులను నమ్మించారు. లక్షల్లో పెట్టుబడులు పెడితే కోట్లల్లో లాభాలు వస్తాయని నమ్మించారు. అంతే కాకుండా యాప్స్ డౌన్లోడ్ చేసుకుని చెప్పినట్టు చేయాలని సూచించారు. ఇక కేటుగాళ్ల సూచనలు ఫాలో అవుతూ డబ్బులు పెట్టిన యువకులు చివరికి తాము మోసపోయామని గ్రహించారు. వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించారు.