కూతురిని హతమార్చిన కసాయి తల్లి..!?
భర్త మరణించిన తరువాత నాగమణి కూలికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే నాగమణి కూతురు మహాలక్ష్మికి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక మహాలక్ష్మి భర్త శ్రవణకుమార్ కొన్ని నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మహాలక్ష్మి భర్త చనిపోయినప్పటి నుండి పుట్టింట్లోనే ఉంటుంది. ఈ తరుణంలోనే మహాలక్ష్మి కొన్ని రోజులుగా ఎవరితోనో గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుతుంది.
కూతురి వ్యవహార శైలిని గమనించిన తల్లి నాగమణి పిల్లలను పట్టించుకోకుండా ఏం ఫోన్లు అంటూ మందలించింది. ఐనప్పటికీ మహాలక్ష్మి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. దాంతో ఈ విషయంలో తల్లీకూతురి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఇక తన కూతురు మహాలక్ష్మి ఇలానే ఎవరితోనో గంటల కొద్దీ కాల్ మాట్లాడుతుండటాన్ని గమనించిన తల్లి నాగమణి ఆమెతో గొడవ పడింది. కూతురిని ఎవరితో గంటల కొద్దీ మాట్లాడుతున్నావ్ అంటూ నిలదీసింది. దానికి మహాలక్ష్మి కూడా సమాధానం ఇవ్వకుండా నీకెందుకంటూ తల్లికి ఎదురు మాట్లాడింది. ఇక ఇద్దరి మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది.
ఆ తరువాత అందరూ నిద్రిస్తుండగా కూతురి ప్రవర్తన పట్ల కోపంతో రగిలిపోయిన నాగమణి నిద్రిస్తున్న మహాలక్ష్మి తలపై బండరాయితో కొట్టింది. అయితే ఈ ఘటనలో మహాలక్ష్మి తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై మహాలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకోని మృతదేహాన్ని పోస్టు మార్ట్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.