ఆస్పత్రిలో కోడలు మృతి.. ఫేక్ కోవిడ్ సర్టిఫికెట్.. చివరకి..?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పటోడా తహసీల్‌లోని ధంగర్ జవాల్కా గ్రామంలో నివాసం ఉంటున్న 21 ఏళ్ల పూజ గణేష్ మే 19వ తేదీన శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. వరకట్నం గురించి అత్తమామలు, భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె ఈ దారుణానికి పాల్పడింది. దీంతో ఆమెను అహ్మద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం పుణెలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె మే 26వ తేదీన మరణించింది.
అయితే పూజ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ చేస్తే ఆమె విషం తాగిన సంగతి బయటపడుతోందని అత్తింటివారు భావించారు. మరణానికి గల కారణాలను కప్పిపుచ్చేందుకు నకిలీ కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ అందజేశారు. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఆమె కోవిడ్ కారణంగా మృతిచెందిందనే వార్తలను నమ్మలేదు. దీంతో మరో పరీక్ష నిర్వహించారు. అందులో ఆమె కరోనా లేదని తేలింది.
ఇక దీంతో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు.. పూజ భర్త గణేష్ రాయ్కర్, మామ శివాజి, అత్త విజుబాయి, నామ్‌దేవ్ సుఖ్డేలపై కేసు నమోదు చేశారు. వీరిలో నామ్‌దేవ్.. గణేష్‌కు బంధువు. అతడు ఫేక్ కరోనా రిపోర్ట్ పొందడానికి వారికి సహాయం చేశాడు. నలుగురు నిందితుల్లో ఇద్దరి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపు చెపట్టామని చెప్పారు.