దారుణం.. మైనర్ బాలికపై 11 మంది లైంగిక దాడి.. చివరికి..
బాలికపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు కేంద్ర ప్రభుత్వోద్యోగి కావడం గమనార్హం.. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నామక్కల్ జిల్లా వడమలై కుళ్లప్పనగర్ లోని నిరుపేద చేనేత కార్మికుడి కుమార్తె అదే గ్రామంలోని కొందరి ఇళ్లలో పాచిపని చేసేది. రెండు రోజుల క్రితం బాలిక ఒంటినిండా గాయాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. విషయం తెలిసి పక్క ఊరిలో ఉంటున్న ఆమె సోదరి వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లింది.
ఏమైంది అని గట్టిగా నిలదీయడంతో..తాను పనిచేస్తున్న ఇళ్ల యజమానులు రెండేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపింది. వారిలో కొందరు శారీరకంగా హింసిస్తూ కామవాంఛ తీర్చుకునేవారని, అందుకే శరీరం పై గాయాలయ్యాయని చెప్పి బాధపడింది.ఆమె సోదరి చైల్డ్‌లైన్ అధికారులకు ఫిర్యా దు చేయగా, జిల్లా శిశు సంక్షేమ శాఖాధికారి రంజిత విచారణ జరిపారు. పోలీసులు కేంద్ర ప్రభుత్వోద్యోగి సహా 11 మందిని అరెస్టు చేశారు.. ఈ విషయం బయటకు పొక్కడంతో బాలికకు న్యాయం చేయించాలని పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో అక్కడ పరిస్థితి గందర గోళం గా మారింది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..