రైతు బంధుకోసం క‌న్న త‌ల్లినే క‌డ‌తేర్చిన క‌సాయి కొడుకు.!

MADDIBOINA AJAY KUMAR
మానవ సంబంధాలన్నీ ఇప్పుడు ఆర్థిక సంబంధాలుగానే మారిపోయాయి. డబ్బు కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధమవుతున్నారు. కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను, తొడబుట్టినవాళ్లను ఇలా ఎవరినైనా కడతేర్చ‌డానికి సిద్ద‌మౌతున్నారు. రోజురోజుకు ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. డబ్బుల కోసం కన్న తల్లినే దాడి చేసి కడతేర్చాడు ఓ క‌సాయి కొడుకు.. పూర్తి వివరాల్లోకి వెళితే...మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం నంచర్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నంచర్ల గ్రామానికి చెందిన నర్సమ్మ 65 కు మొత్తం 8మంది సంతానం..వారిలో ఇద్దరు కుమారులు కాగా నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు మల్లయ్య. కాగా నర్సమ్మ పేరు పై ఐదెకరాల పొలం ఉంది. అందులో కొంత పొలాన్ని న‌ర్స‌మ్మ సాగుచేస్తుంది. ఇంకా ఆ పొలం పంపకాలు ఇంకా జరగలేదు.
దాంతో ప్రసబుత్వం ఇస్తున్న రైతు బంధు డబ్బులు తల్లి నర్సమ్మ ఖాతాలోనే పడుతున్నాయి. న‌ర్స‌మ్మ ఖాతాలో ఎక‌రాకిని రూ.5వేల చొప్పున ప‌డుతున్నాయి. కాగా రైతు బంధు డబ్బులు తనకు ఇవ్వడం లేదని తల్లిపై మల్లయ్య కోపం పెంచుకున్నాడు. డబ్బులు ఇవ్వాలని తల్లి తో పలు మార్లు గొడవలు పెట్టుకున్నాడు. అయినా న‌ర్స‌మ్మ డ‌బ్బులు ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఈ క్రమంలో సోమవారం పొలం వద్దకు వెళ్లిన మల్లయ్య తన తల్లి సాగు చేస్తున్న ఉల్లి పంటను ఎద్దులతో దున్ని నాశనం చేసాడు. దాంతో తల్లి నర్సమ్మ అతడిని దూషించింది. కోపం తో రగిలిపోయిన మల్లయ్య తల్లిపై దాడి చేశాడు. అక్కడే గొంతు నులిమి హత్య చేశాడు. రైతు బంధు డబ్బులు ఇవ్వడం లేదనే కారణం తోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. స్థానికులు స‌మాచారం అందించ‌డంతో ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు మ‌ల్ల‌య్య‌ను అదుపులోకి తీసుకుని కేసు న‌మోదుచేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: