ఛీ ఛీ.. నువ్వు అసలు మగాడివేనా ..భార్య పై వేరేవాడు అలా..

Satvika

సొంత ఇంట్లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది..ఆడవాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే ముందు వరకు కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నారు. అంతేకాదు ప్రతి రోజు దేవుడిని ప్రార్థిస్తారు.  కామాంధుల చేతిలో పడి తమ జీవితం నాశనం కాకుండా కాపాడాలని. ఒకప్పుడు ఆడవాళ్ళు వంటిల్లోనే ఉంటూ భర్త కుటుంబంతో సంతోషంగా ఉండాలని పూజలు చేస్తూ అందరి బాగును కోరుకునేవారు..కానీ ఇప్పుడు వారు బయటకు వెళ్లాలంటే భయంతో వణుకుతున్నారు.విషయానికొస్తే.. సొంత వాళ్ళతోనే రక్షణ లేకుండా పోయింది.కట్టుకున్న భార్యను తన స్నేహితుడు రేప్ చేస్తుంటే భర్త బయట ఉండి కాపలా కాస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

 

 

 

వివరాల్లోకి వెళితే.. భార్యని తన స్నేహితుడు రేప్ చేస్తుంటే సిగ్గులేకుండా గది బయట కాపలా కాసిన నీచుడి బాగోతం బట్టబయలైంది. చంపేస్తామని బెదిరించి భార్యని స్నేహితుడికి అప్పజెప్పి దారుణంగా రేప్ చేయించిన సంఘటన జైపూర్ లో తీవ్ర కలకలం రేపింది.ఆళ్వార్ జిల్లాలోని షాజహాన్‌పూర్ ప్రాంతానికి చెందిన వివాహిత ను ఆమె భర్త మార్కెట్‌కి వెళ్దామని చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు. దారిలో తన ఫ్రెండ్ ని వెంట తీసుకెళ్లాడు. భార్య ఉండగానే అతన్ని కూడా అదే బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బైక్ ఆపాడు.

 

 


అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత తన ఫ్రెండ్ తన భార్య చేయిని పట్టుకొని బలవంతంగా పక్కనే ఉన్న పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్ళాడు.అతడు భార్యను రేప్ చేస్తుంటే బయట ఉన్న ఆ నీచుడు ఎవరు రాకుండా కాపలా కాసిన దుస్థితి ఏర్పడింది. అంతేకాదు జరిగిన విషయం గురించి  ఎవరికైనా చెబితే చంపేస్తామని   బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన ఆమె తనపై జరిగిన అఘాయిత్యాన్ని కన్నవాళ్లకు చెప్పుకుని భోరుమంది. వారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: