మ్యాగీతో ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా?
ఈ మ్యాగీతో ఐస్‌క్రీమ్ తయారు చేస్తే ఎలా ఉంటుంది. అందేంటి ఐస్‌క్రీమ్ తియ్యగా ఉంటుంది, మ్యాగీ కారంగా ఉంటుంది. ఆ రెండింటిని ఎలా కలుపుతారనే సందెహాలు చాలా మందికి వస్తాయి. ఒకవైపు తీపి, మరోవైపు కారం అందరినీ ఆకర్షించింది. ఈ రెండు కలిపి తింటే ఏమి కాదా? ఏంటో ఈ జనాలు వింత అంటూ విరక్తి కలిగిస్తున్నారు. అందుకే ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఒకసారి ఆ మ్యాగిని ఎలా తయారు చెస్తారో ఇప్పుడు చూద్దాం..
ఐస్‌క్రీమ్ మేకర్ ముందుగా రడీ చేసిన మ్యాగీని తీసుకున్నాడు. ఆ తర్వాత అందులో క్రీమ్‌ను పోసి మ్యాగీని స్మాష్ చేసి అనంతరం వాటిని ఐస్‌క్రీమ్ రోల్స్‌గా మార్చేశాడు.ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇది మ్యాగినీ దుర్వినియోగం చేయడం అవుతుంది అనే ఫన్నీ క్యాప్షన్ తో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. ఇదేం పిచ్చి సామీ అని కొందరూ కామెంట్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం ఇది వెరైటీ అని కామెంట్ చెస్తున్నారు. ఈ వెరైటీ మ్యాగీ , ఐస్ క్రీమ్ వీడియోను మీరు ఒకసారి చూడండి..