ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్న వంశీ పైడిపల్లి.. వర్కౌట్ అవుతుందా..?

murali krishna
సౌత్‌ దర్శకులు ఈమధ్య వరుసగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బ్లాక్‌ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. షారుఖ్‌ ఖాన్‌తో అట్లీ చేసిన 'జవాన్‌' సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించగా, రణబీర్‌ కపూర్‌తో సందీప్‌ వంగా చేసిన యానిమల్‌ సినిమా సైతం రూ.900 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టింది. అందుకే బాలీవుడ్‌ స్టార్స్‌ సౌత్‌ దర్శకుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సమయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి బాలీవుడ్‌ మిస్టర్ పర్ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్‌ తో సినిమాకు ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో వంశీ పైడిపల్లి అమీర్ ఖాన్‌ని మెప్పించగలడా? అనే సందేహం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడూ స్టార్ హీరోలతో పనిచేయాలనుకునే దర్శక నిర్మాత వంశీ పైడిపల్లి. మహేష్ బాబు నటించిన మహర్షితో వంశీ సూపర్ డూపర్ హిట్ కొట్టినప్పటికీ, మన స్టార్స్ అతనితో పని చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.

ఈ క్రమంలో వంశీ పైడిపల్లి తనవద్ద ఉన్న ఒక సోషల్‌ మెసేజ్ కథతో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్ ఖాన్‌ ను ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. స్టోరీ లైన్ నచ్చిన ఆమిర్ ఖాన్ పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని అన్నారట. దాంతో వంశీ ప్రస్తుతం తన టీంతో స్క్రిప్ట్‌ ను రెడీ చేసే పనిలో ఉన్నారట. స్క్రిప్ట్‌ కనుక ఆమిర్ ఖాన్‌ కి నచ్చితే కచ్చితంగా ఒక బిగ్‌ మూవీ రాబోతుంది. దిల్‌ రాజు బ్యానర్‌లో ఆ సినిమా ఉంటుందని, ఆమిర్ ఖాన్ సైతం ఆ సినిమా నిర్మాణంలో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం దిల్‌ రాజు నిర్మించారు. వాటిల్లో ఎక్కువ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. వంశీ చివరగా తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌తో వారిసు సినిమా తీశారు. ఆ సినిమా కోలీవుడ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
విభిన్న చిత్రాలను రూపొందించిన వంశీ పైడిపల్లి సినిమాల ఫలితాలను కాకుండా ఆమిర్‌ కాన్సెప్ట్‌లను చూసినట్లుగా తెలుస్తోంది.

అందుకే వంశీ పైడిపల్లితో సినిమాను చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారంటూ టాక్. సౌత్‌ దర్శకులు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తే హిట్‌ ఖాయం అనే సెంటిమెంట్‌ ఉంది. కనుక హిట్‌ కోసం ఎదురు చూస్తున్న ఆమిర్‌ ఖాన్‌ ఛాన్స్ ఎందుకు వదులుకుంటారు.. అందుకే వంశీ పైడిపల్లిని పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మన్నారని తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమిర్‌ ఖాన్‌ సక్సెస్‌లు లేక పోవడంతో డీలా పడ్డారు.లాల్ సింగ్‌ చద్దా సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆమిర్‌ ఖాన్ సినిమా మొదలుపెట్టలేదు. ఒకటి రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభం అయ్యాయి అనే వార్తలు వచ్చాయి, కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్‌ చేశారట. మొత్తానికి ఆమిర్‌ ఖాన్‌ ఒక సూపర్‌ హిట్‌ సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నారు. కనుక వంశీ పైడిపల్లికి అదే మంచి అవకాశంగా మారింది. మహర్షి వంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్‌ కమర్షియల్‌ సినిమాను తీసిన వంశీ పైడిపల్లి కచ్చితంగా ఆమీర్‌ ఛాన్స్‌ ఇస్తే తప్పకుండా మంచి సినిమాతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దిల్‌ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు రెడీ అన్నట్లుగా ఉన్నారట. వచ్చే ఏడాది ఆరంభానికి ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: