డయాబెటిస్ రోగులకు అలర్ట్ ... ఈ 4 తప్పులు చేస్తే లైఫ్ ఖతం అయినట్లే..!
అది జీవితాంతం ఉంటుంది. డయాబెటిక్ రోగులు.. ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే నిర్వాహణ కష్టం అవుతుంది. డయాబెటిస్ లో ఏ రకమైన నిర్లక్ష్యం కూడా ప్రమాదకరమైన పరిమాలకు దారితీస్తుంది. సాధారణంగా ప్రజలు తమ అనారోగ్య కరమైన జీవనశైలి... అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ స్పైక్ లను నివారించుకుంటే వారు ఎలాంటి తప్పులు చేయకూడదు... ఆరోగ్యంగా ఉండాడాన్ని ఏం చేయాలి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారంతో పాటు...కొన్ని విషయాలపై అవగాహనతో ఉండాలి.
శారీరకంగా చురుకుగా ఉండటం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. ఇది డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయపడుతుంది:తగినంత శారీరక శ్రమ లేకపోవడం బరువు పెరగడానికి, ఇన్సులిన్ నిరోధకతను దారితీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ నడవడం, జాగింగ్ చెయ్యటం లేదా యోగా చేయటం మంచిది. అయితే, వ్యాయామం చాలా శ్రమతో కూడుకున్నది కాదని గుర్తించుకోండి :ప్రతిరోజు ఓ గంట వ్యాయామం చేయటం ప్రారంభించండి. ఫైబర్ అనేక విధాలుగా మీ ఆరోగ్యానికి ముఖ్యమైనది. ఇది మధుమేహం నిర్వహణలో కూడా సహాయపడుతుంది. ఫైబర్- ఆధారిత ఆహారాలు తినటం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రరించడంలో సహాయపడుతుంది:ఇన్సులిన్ సెన్సిటివిటిని మెరుగుపరుస్తుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ ను ప్రోత్సహిస్తుంది. మీ ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, గింజలు వంటి అధిక ఫైబర్ ఆహారాలను చేర్చండి. ఇది మీ ఆరోగ్యకరమైన బరువులు కూడా నిర్వహిస్తుంది.