మెడ నొప్పితో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..!
తలపై ఎక్కువగా బరువులు మోసేవారు కూడా ఈ మెడ నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. మెడ నొప్పి తగ్గించుకునేందుకు క్రీములు, స్ప్రెలు వాడుతూ ఉంటారు. మెడ నొప్పి వచ్చిందంటే అంత త్వరగా తగ్గదు. కానీ యోగాతో మెడ నొప్పిని ఈజీగా తగ్గించుకోవచ్చు. యోగాతో తగ్గించుకోలేని సమస్య ఏదీ ఉండదు. క్రీములు, స్ప్రేలు పాడకుండా ఈ యోగాసనాలతో ఈజీగా మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు. మార్జారి లేదా బిథిలాసనం వెయ్యటం వల్ల నెక్ పెయిన్ తగ్గిపోతుంది. ఈ ఆసనం వెయ్యటం చాలా సింపుల్. దీనివల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటి పెరుగుతుంది. నడుము, మెడ, కండరాల నొప్పులు అన్ని తగ్గుతాయి.
మెడ నొప్పిని తగ్గించుకోవడంలో బాలసనం కూడా చక్కగా పనిచేస్తుంది. మెడ, భుజకండరాలు రిలీఫ్ అవుతాయి. అంతేకాకుండా దృఢంగా మారుతాయి. సేతు బందాసనం కూడా మెడ నొప్పిని తగ్గిస్తుంది. ఇది కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అదేవిధంగా సుఖాసనం వేసిన మెడ నొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఈ ఆసనం వెయ్యటం కూడా చాలా సింపుల్. ఈ ఆసనంతో తక్షణమే ఉపశ్రమమం అవుతారు. అలాగే ఉస్త్రసనం, గోముఖసనం కూడా మెడ నొప్పి, భుజం నొప్పులను కంట్రోల్ చేస్తుంది. ఈ ఆసనాలు వేయటం వల్ల మీ నొప్పి నుంచి ఉపశ్రమమం పొందవచ్చు. తప్పకుండా ఈ ఆసనాలను వేయండి. మెడ నొప్పి తగ్గించుకునేందుకు క్రీములు, స్ప్రెలు వాడుతూ ఉంటారు.