ఇప్పుడు ఎవ్వరి నోట విన్న ఆ హీరో పేరే..బూతులు తిడుతున్నారు.. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..?

frame ఇప్పుడు ఎవ్వరి నోట విన్న ఆ హీరో పేరే..బూతులు తిడుతున్నారు.. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..?

Thota Jaya Madhuri
అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..? ఒక హీరోని టార్గెట్ చేసి ఎందుకు జనాలు ఎక్కువగా హింసిస్తున్నారు..? ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే ఆ హీరో ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . ఆ హీరో ఎవరో అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పదే పదే ఈ హీరో పేరుని టార్గెట్ చేస్తున్నారు. ఆ హిరో మరి ఎవరో కాదు అల్లు అర్జున్ ..స్టైలిష్ స్టార్ ..బన్నీ . పుష్ప2 సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన అల్లు అర్జున్ . ఈ పేరు ఓ వైరస్ లా అందరికి ఎక్కేసింది.



అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగత హీరోలు తక్కువ అనే అంటుంటారు జనాలు. అయితే రీసెంట్గా రాంచరణ్ పుట్టిన రోజు జరుపుకున్నాడు.  ఈ సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి  ట్రోల్ చేస్తున్నారు.  అల్లు అర్జున్ విష్ చేయలేదు అని..  ఆ కారణంగానే అల్లు అర్జున్ - రామ్ చరణ్ కి మధ్య అస్సలు పడడం లేదు అని .. రకరకాలుగా మాటల యుద్ధం జరిపేసుకుంటున్నారు.  అయితే ఇక్కడ కామన్ పీపుల్స్ వర్షెన్  మరోలా ఉంది .



వాళ్ళిద్దరూ స్టార్ హీరోస్ ..బంధువులు కూడా చిన్న చిన్న తగాదాలు ఉంటాయి . అది వాళ్ళు చూసుకుంటారు.  సోషల్ మీడియా వేదికగా విష్ చేయక పోతే ఏముంది..?  పరసనల్ గా కూడా విష్ చేయొచ్చుగా..? ఎందుకు కావాలని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక్క హీరోని టార్గెట్ చేస్తే ఆ హీరో పై మిగతా వాళ్ళందరూ కూడా  చాడీలు చెప్పడం..  కోపంగా మాట్లాడటం అలవాటుగా మార్చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు అల్లు అర్జున్ ని స్టేజిపై పరోక్షకంగా కౌంటర్ వేసి ఆటపట్టించారు..పుష్ప 2 సినిమా గురించి వెటకారంగా కామెంట్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: