ఈరోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. కరోనా లాంటి మహమ్మరి లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చిరు తిండి విషయం లో మాత్రం ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ప్రాణాలు హరి అనడం ఖాయం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. భోజన ప్రియులు ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ఆలోచన చేస్తారు. రోజూ తినేలా కాకుండా కొత్తగా తినాలనిపించి ఏదేదో చేస్తారు. ఇలాంటి వాళ్ళను ఆకర్షించడానికి హోటల్ నిర్వాహకులు కూడా కొత్తగా చేస్తారు. అలాంటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా, తాజాగా మరో వీడియో జనాలకు ఫుడ్ పై విరక్తిని కలిగిస్తుంది. పానిపూరి తో నూడిల్స్.. రెండు మంచి రుచి ఉన్న ఫుడ్స్.. విడి విడిగా తినడానికి ఇవి చాలా బాగుంటాయి. కానీ కొత్తగా అని చెత్తగా చేస్తున్నా కొన్ని జనాలకు జంక్ ఫుడ్స్ పై అసహ్యాన్ని కలిగిస్తున్నాయి.. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పానీపూరి, నూడిల్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఈ వీడియో ను చూస్తె ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. పానీపూరి, నూడిల్స్ కలిపి పెరుగుతో చేస్తున్న ఒక వెరైటీ డిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శాండ్ విచ్ పానీపూరి, బర్గర్ పానీపూరి ఇలా ఒక్కటేమిటీ అనేక రకాల వంటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇది కూడా వైరల్ అవుతుంది. పానిపూరికి ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడథారు. ఇది వింటే మాత్రం జన్మలో తినరు. అంత అసహ్యంగా ఉంటుంది.పూరీలో బంగాళా దుంపలతో నింపి అందులో మరిన్ని మసాలాలు వేస తీపి చట్నీ జోడంచాడు. ఆ తర్వాత పానీపూరిపై నూడిల్స్ వేసి దానిపై సాస్, పెరుగు,పచ్చిమిర్చి, టూటీ ఫ్రూటీ, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు వేసి కలర్ ఫుల్ గా డేకరేట్ చేసాడు. అంతేకాదు.. కొబ్బరిని జోడించాడు. ఈ పానీపూరి వడ్డించే కంచంలో ఎరుపు, ఆకుపచ్చ చట్నీను జోడించాడు. వామ్మో వింటూంటే ఎదొలా వుంది. ఆలస్యం ఎందుకు ఆ వీడియోను మీరు కూడా ఒకసారి చూడండి..