ఆఫీస్ కి హడావిడిగా వెళ్ళేవారు ఈ హెల్తీ దోస తిని వెళ్తే చాలా హుషారుగా ఉంటారు....!!!

Purushottham Vinay

చాలా మంది ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్తుంటారు. కాని ఆ హడావిడిలో సరిగ్గా బ్రేక్ ఫాస్ట్ చెయ్యకుండా వెళ్ళిపోతారు. చేసిన ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ చెయ్యకుండా వెళ్ళిపోతారు. అలాంటి రోజు ఉదయాన్నే హెల్తీ బేసన్ దోసని తినండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక దీన్ని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....
కావాల్సిన పదార్ధాలు....
బియ్యం:4 cup(5గంటలు నానబెట్టుకోవాలి)

ఉద్ది పప్పు: 1cup(5గంటలు నానబెట్టుకోవాలి)

శెనగపప్పు: 1cup కొద్దిగా అటుకులు మెంతులు: 1tsp
పంచదార: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
బేకింగ్ సోడ: చిటికెడు
మసాలా కోసం :
బంగాళదుంప: 2(ఉడికించి, పొట్టు తీసి, మ్యాష్ చేసినవి)
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా...
చట్నీకోసం:
కొబ్బరి తురుము: 1CUP
పచ్చిమిర్చి: 4
పంచదార1
అల్లం : చిన్న ముక్క
కొత్తిమీర తరుగు పోపుదినుసులు ఫ్రై చేసుకొన్నవి: 3tsp
ఇంగువ: చిటికెడు
నూనె: 1tsp
ఆవాలు: 1tsp
ఉప్పు రుచికి సరిపడా

బేసన్ దోస తయారు చేసే విధానం:
ఇక ముందుగా దోసకోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్ని గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక రాత్రి అలాగే పెట్టడం వల్ల దోసపిండి పులిసి దోసెలు మెత్తగా వస్తాయి.  తర్వత మరుసటి రోజు ఉదయం దోస పాన్ స్టౌ మీద పెట్టి, దోసె పిండిని వేసి పల్చగా దోసె వేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ నెయ్యితో ఫ్రైచేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్ని దోస మీద వేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదా సెంటర్లో పెట్టి రోల్ చేసి అందివ్వొచ్చు. ఇప్పుడు చట్నీ కోసం సిద్దం చేసుకొన్న వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. అంతే చట్నీ రెడీ.ఇప్పుడు నెయ్యితో రోస్ట్ చేసి ఉల్లిపాయలు, టేస్టీ చట్నీతో బేసన్ దోసను బ్రేక్ ఫాస్ట్ గా తింటే చాలా బాగుంటుంది...ఇది చాలా లైట్ గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం  మీరు ట్రై చెయ్యండి.......

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: