చలికాలంలో ఆరోగ్యకరమైన క్యారెట్ హల్వా తయారు చేసుకోండి....

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఈ చలికాలంలో బాగా తినాల్సిన ఆరోగ్యకరమైన ఆహారం క్యారెట్ హల్వా... ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది... క్యారెట్ హల్వా  గొప్పదనం కేవలం దాని రుచిలో మాత్రమే లేదు, ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా ఉంది. ఈ హల్వాలో వాడే ప్రతి ఇన్‌గ్రీడియెంట్ కీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేమిటో, ఈ హల్వాని ఎలా చేయాలో తెలుసుకోండి...
క్యారెట్ హల్వా తయారీ విధానం....
ముందుగా అరకిలో పైన క్యారెట్స్ ని శుభ్రంగా కడిగి తొక్క తీసేయండి.ఇప్పుడు ఈ క్యారెట్స్ ని తురమండి. మీకు సుమారుగా నాలుగు, నాలుగున్నర కప్పుల క్యారెట్ తురుము కావాలి.అడుగు మందంగా ఉన్న కడాయిలో ఈ తురిమిన క్యారెట్స్ వేయండి. ఇందులోనే నాలుగు కప్పుల ఫుల్ ఫ్యాట్ మిల్క్ పోయండి.స్టవ్ ఆన్ చేసి, పాలు, క్యారెట్ తురుముని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని లో నుండి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. కొంత సమయం తరువాత పాలు ముందుగ నురగ వస్తాయి, ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా దగ్గర పడతాయి.ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా కలుపుతూ ఉండాలి, లేదా అడుగు పట్టేస్తుంది. కడాయి కి అంటుకుంటున్న పాల మీగడని తీసేసి మిశ్రమం లో కలుపుతూ ఉండండి.పాలు 75% ఆవిరి అయ్యేవరకూ ఉడికించండి. ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి కలపండి. మీరు నెయ్యి కలిపేటప్పటికి ఇంకా మిశ్రమం లో కొన్ని పాలు ఉంటాయి, గమనించండి.
నెయ్యి అంతా బాగా కలిసేవరకూ కలపండి. ఇప్పుడు 10 నుండి 12 టేబుల్ స్పూన్లు, లేదా రుచికి తగినంత, పంచదార కలపండి.అలాగే, సుమారుగా ఒక టీ స్పూన్ ఎలకుల పొడి కూడా కలపండి.మధ్య మధ్య లో కలుపుతూ ఉడికించండి.హల్వా మిశ్రమం దగ్గర పడేవరకూ సిమ్ లో ఉంచండి. హల్వా మిశ్రమం బాగా దగ్గర పడిన పుడ్డింగ్ లాగా తయారైన తరువాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వంటివి యాడ్ చేసుకోవచ్చు. సిమ్ లోనే ఉంచి బాగా కలుపుతూ ఉండండి. పాలు పూర్తిగా అవిరై మిశమం బాగా దగ్గర పడేవరకూ ఉడికించండి. మీకు హల్వా మీద మిల్క్ సాలిడ్స్ కనబడతాయి.ఈ హల్వాని వేడిగా లేదా చల్లగా చేసుకొని తినొచ్చు. దీన్ని ఫ్రిజ్ లో పది రోజుల పాటూ నిల్వ ఉంచుకోవచ్చు.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: