రుచికరమైన ఆల్మండ్ చట్నీ తయారు చేయు విధానం....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఆల్మండ్స్ లో ఉండే మినరల్స్, జింక్, మెగ్నీషియం, పొటాషియం ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి, రెస్పిరేటరీ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తాయి. ఇక  ఈ చట్నీలో ఇంకా విటమిన్ సీ పుష్కలం గా ఉండే పుదీనా, కొత్తిమీర కూడా ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేసి సీజనల్ ఫ్లూ నుంచి రక్షిస్తాయి.శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. కళ తగ్గి నిర్జీవంగా కనపడుతుంది. అందుకనే ఈ కాలం లో ఆహారం లో స్కిన్ కి మేలు చేసే న్యూట్రియెంట్స్ ఉన్న పదార్ధాలని భాగం చేసుకోవాలి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. బాదం పప్పు సరిగ్గా అదే పని చేస్తుంది. పైగా ఇందులో ఉండే విటమిన్ ఈ యాక్నే, ముడతలు రాకుండా చేస్తుంది.
ఆల్మండ్ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు:

బాదం పప్పు - అర కప్పు
కొత్తిమీర - అర కప్పు
పుదీనా - అర కప్పు
పచ్చి మిర్చి - రెండు మూడు, లేదా రుచికి తగినన్ని
వెల్లుల్లి - రెండు మూడు రెమ్మలు
అల్లం - అరంగుళం ముక్క
చింత పండు పులుసు - రెండు టేబుల్ స్పూన్లు
బ్లాక్ సాల్ట్, పంచదార - రుచికి తగినంత
చాట్ మసాలా - కావాలంటే

ఆల్మండ్ చట్నీ తయారు చేసే పద్ధతి:

ముందుగా ఆల్మండ్స్ ని డ్రై గ్రైండ్ చేయండి.ఇందులో పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి స్మూత్ పేస్ట్ లా చేయండి. అవసరాన్ని బట్టి నీరు కానీ పెరుగు కానీ కలుపుకోవచ్చు. చింత పండు పులుసు కానీ, నిమ్మ రసం కానీ కలపండి.బ్లాక్ సాల్ట్, పంచదార, చాట్ మసాలా కూడా కలిపి బాగా మిక్స్ చేయండి.స్పైసీ గా ఉండే ఆల్మండ్ చట్నీ రెడీ అయిపోయింది. పరాఠాలతో తింటే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: