రుచికరమైన చిరుధాన్యాల బిస్కెట్స్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. డిసెంబర్ నెల అంటేనే గుర్తొచ్చేది క్రిస్టమస్ పండుగ. క్రిస్మస్ పండుగ సందర్బంగా మనం చాలా కుకీస్ తయారు చేసుకుంటాం. కాని ఆరోగ్యంగా ఉండాలంటే చిరు ధాన్యాలతో కుకీస్ ట్రై చెయ్యండి. ఇవి రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.ఇవి జీర్ణ క్రియకి, జీవ క్రియకి ఎంతగానో మంచిది. కాబట్టి ఈ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన చిరుధాన్యాల కుకీస్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

కావాల్సిన పదార్థాలు.. ఒక కప్పు మైదా పిండి 
 3/4 కప్పు ఊదల పిండి
 3/4 కప్పు పటిక బెల్లం పొడి
 1/2 కప్పు పటిక బెల్లం పొడి 
 వంద గ్రాముల సాల్టెడ్ బటర్
 పీనట్ బటర్ 
చాకొలేట్ గనాష్ 
కలర్‌ఫుల్ స్ప్రింక్లర్స్


చిరుధాన్యాల కుకీస్ తయారు చేయు విధానం....

ఒక డీప్ బౌల్ లో పటిక బెల్లం పొడిని జల్లెడ పట్టి వేయండి.రూమ్ టెంపరేచర్ లో బటర్ యాడ్ చేసి హ్యాండ్ బ్లెండర్ తో బీట్ చేయండి. ఈ మిశ్రమం లైట్ గా ఫ్లఫ్ఫీ గా అయ్యెవరకూ బీట్ చేయండి. ఇందులో జల్లెడ పట్టిన మైదా, ఊదల పిండి ని కలపండి. పిండి దగ్గరకి వచ్చేవరకూ చేతులతో బాగా కలపండి. మరీ అవసరమనుకుంటే కొన్ని చుక్కలు గోరు వెచ్చని పాలు పోసి కలపండి. ఈ పిండిని ముప్ఫై నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచండి. ఆ తరువాత ఈ పిండిని అప్పడాల కర్రతో వత్తండి. మీకు కావాల్సిన షేప్ లో కట్ చేయండి. ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 170 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 - 25 నిమిషాలు, లేదా కుకీలు అంచుల వద్ద బ్రౌన్ గా అయ్యేవరకూ బేక్ చేయండి.

 ప్రతి పది నిమిషాలకీ ఒకసారి చెక్ చేసుకోవడం మర్చిపోకండి.అయిపోయిన తరువాత వాటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తరువాత పీనట్ బటర్, షుగర్ గ్లేజ్, స్ప్రింక్లర్స్, లేదా డార్క్ చాకొలేట్ గనాష్ తో డెకొరేట్ చేయండి. మీ పిల్లల్ని ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేస్తే వారికీ సరదాగా ఉంటుంది.ఇవి మిల్లెట్స్ తో చేశారు కాబట్టీ వాటిని ఆ రోజే తినేయండి. పిల్లలు వీటిని పాలతో కలిపి తినడానికి ఇష్టపడతారు.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: