రుచికరమైన చికెన్ సమోసా ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సమోసా అంటే అందరికి చాలా ఇష్టం. అయితే దానికి చికెన్ యాడ్ చేసి బాగా రుచికరమైన చికెన్ సమోసా ఎలా చెయ్యాలో తెలుసుకోండి..

కావాల్సిన పదార్ధాలు....

చికెన్‌ కీమా - 1 కప్పు
 
కారం పొడి- 2 స్పూన్లు

 గరం మసాల - స్పూను
పసుపు - అర స్పూను
సోంపు పౌడర్‌ - స్పూను
 ఉప్పు - తగినంత

మిరియాల పొడి - అరస్పూను

ఉల్లిపాయలు - 3
నూనె - వేయించడానికి సరిపడా
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు
పచ్చిమిర్చి - 3

గుడ్డు - 1
గోధుమపిండి - కప్పు
మైదాపిండి - 2 కప్పులు
 ధనియాల పొడి - 2 స్పూన్లు
నిమ్మకాయ -1
 నీళ్లు - సరిపడా
కొత్తిమీర - కొద్దిగా,


తయారు చేయు విధానం..
ఫస్ట్ కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్‌ మిన్స్‌ మిక్స్ చెయ్యాలి. తర్వాత అందులోనే సోంపు పౌడర్‌, మిరియాలు, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని కలపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో.. గోధుమ పిండి, మైదాపిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా కలిపి 15 నిమషాలు అలాగే పెట్టాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్నచిన్న చపాతీల మాదిరిగా చేసుకోవాలి. వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న చికెన్‌ మిశ్రమాన్ని నింపి.. సమోసాల మాదిరిగా ఒత్తుకోవాలి. అదనపు రుచికోసం మిశ్రమంలో నిమ్మరసం, కొత్తిమీర వేసుకోవచ్చు.ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: