నోరూరించే మిక్స్డ్ దాల్ వడ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...
మిక్స్డ్ దాల్ వడ తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు...
ప్రధాన పదార్థం...
1 కప్ పెసరపప్పు,
1 టేబుల్ స్పూన్ సెనగ పప్పు,
1 టేబుల్ స్పూన్ కందులు,
2 టేబుల్ స్పూన్ మినపప్పు..
ప్రధాన వంటకానికి...
అవసరాన్ని బట్టి చింతపండు పచ్చడి,
అవసరాన్ని బట్టి మిరపపొడి,
అవసరాన్ని బట్టి చాట్ మసాలా,
అవసరాన్ని బట్టి వేయించిన జీలకర్ర పొడి,
అవసరాన్ని బట్టి హిమాలయన్ సాల్ట్,
3 టేబుల్ స్పూన్ పాలు,
అవసరాన్ని బట్టి రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె,
అవసరాన్ని బట్టి యోగర్ట్,
అవసరాన్ని బట్టి అసఫోయ్టెడా..
మిక్స్‌డ్ దాల్ వడ రెసిపీ తయారు చేయు విధానం..
ముందుగా అన్ని పప్పులని తీసుకుని ఓ పెద్ద బౌల్‌లో 2 గంటల ముందు నానబెట్టాలి. ఎప్పుడైతే పప్పులన్నీ చక్కగా నానుతాయో.. వాటిని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన పేస్ట్‌లో ఇంగువ వేసి బాగా కలపాలి. ఇప్పుడు పెరుగుని బాగా కలపండి. తర్వాత అందులోని పాలు కూడా వేసి మరికాసేపు బాగా కలపాలి. అనంతరం ఉప్పు కూడా వేసి కలిపి పక్కన పెట్టాలి.
ఇప్పుడు పాన్ తీసుకుని వేడి చేయాలి. పాన్ వేడి అయిన తర్వాత నూనె వేసి వేడి చేయండి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని తీసుకుని మరుగుతున్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఓ గిన్నెలో నీరు నింపి అందులో తయారైన వడలను వేసి నూనె పోయేలా కాస్తా పిండి బయటికి తీసి ప్లేట్‌లో పెట్టండి. చివరిగా వడలపై పెరుగు, చాట్ మసాలా, వేయించిన జీలకర్ర, కారం, స్వీట్ చింతపండు చట్నీ వేసి సర్వ్ చేయండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే వడ తయారైనట్లే.