మిడిల్ ఈస్ట్ చికెన్ కబాబ్ ఈ స్పెషల్ ఎప్పుడైనా చేసారా...?

Sahithya
నాన్ వెజ్ లో చికెన్ తో చాలా చాలా వంటలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాని మనకు మాత్రం అవి చాలా వరకు తెలియదు. నాన్ వెజ్ అనగానే చాలా మందికి చికెన్ కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. చాలా వరకు కూడా చికెన్ తో చేసుకునే వంటలే ఎక్కువగా ఉంటాయి అనే మాట వాస్తవం. చికెన్ లో చాలా స్పెషల్స్ ఉన్నా సరే మనకు మాత్రం కొన్నే తెలుసు. చాలా మందికి మిడిల్ ఈస్ట్ చికెన్ కబాబ్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు మీకు అది చెప్తాను...
దానికి కావాల్సినవి ఏంటీ అంటే బోన్ లెస్ చికెన్ - 1/2 కేజీతో పాటుగా పెరుగు – అర కప్పు, ఫ్రెష్ క్రీం - 3 టేబుల్ స్పూన్స్  వెల్లులి -2 రెబ్బలు కావాలి. ఉప్పు – తగినంత వేయండి. నిమ్మకాయ - 1 టీ స్పూన్ చాలు. గరం మసాలా -1 టీ స్పూన్ కావాలి. కుంకుమ పువ్వు - 1/4 టీ స్పూన్ కావాలి. కోడి గుడ్డు ఒకటి కావాలి. ఉల్లి పాయ  కూడా ఒకటి కావాలి.  నూనె -2 టేబుల్ స్పూన్లు వేయండి.
ఎలా తయారు చేస్తారు అంటే... ముందుగా ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, పెరుగు ,ఫ్రెష్ క్రీం ,సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు ,ఉప్పు ,నిమ్మకాయ , గరం మసాలా ,కుంకుమ పువ్వు ,నూనె ,మరియు గుడ్డు వేసి బాగా కలుపి 2 నుండి 4 గంటలు మ్యారినేట్ చేయండి.  ఆ తరువాత చువ్వకి చికెన్ ముక్కలు మరియు పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని గుచ్చుకుని ఒవేన్ లో 200 డిగ్రీల మీద గ్రిల్ చేయండి. ఒక పక్క బాగా గ్రిల్ అయితే మరో పక్క గ్రిల్ చేయండి. అంతే మీకు చికెన్ మిడిల్ ఈస్ట్ చికెన్ కబాబ్ రెడీ అయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: