దళపతి విజయ్.. అసలు పేరు ఏంటి? ఏం చదువుకున్నారో తెలుసా..?

Divya
తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా, సౌత్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జననాయగన్. ఈ సినిమాతో విజయ్ రిటైర్మెంట్ కూడా ప్రకటించారు. ఆ తర్వాత పొలిటికల్ వైపుగానే పూర్తిగా ఫోకస్ చేయబోతున్నారు. జననాయగన్ చిత్రం జనవరి 9వ తేదీన విడుదల కాబోతోంది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నారు. సుమారుగా రూ.300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.



ఈ సినిమా బడ్జెట్లో సుమారుగా 70% వరకు విజయ్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో దళపతి ట్యాగ్ లైన్ ని హైలెట్ చేసి చూపించారు. అసలు విజయ్ అసలు పేరు ఏంటి? అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. కానీ సినిమాల కోసం తన పేరును సింపుల్గా విజయ్ అని మార్చుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. పాఠశాల విద్యను మొదట కోడంబాక్కంలో  ఫాతియా స్కూల్లో పూర్తి చేశారు. కాలేజీ విషయానికి వస్తే లయోలా కాలేజీలో కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.


యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో తన చదువును మధ్యలో ఆపేసి యాక్టర్ గా ప్రయత్నాలు చేశారు. పిఎస్ వీరప్ప నిర్మించిన 1984 లో వచ్చిన వెట్రి అనే సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో బాల నటుడుగా నటించిన విజయ్ తన తండ్రి దర్శకత్వం వహించిన నాన్ సిగప్పు మనిదన్ చిత్రంతో రజనీకాంత్ తో కలిసి విజయ్ నటించారు. 1996లో 18 ఏళ్ళ వయసులో  నాలైయ తీర్పు అనే చిత్రంతో మొదటిసారిగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రసిగన్ , దేవా, పూవే ఉనక్కాగ చిత్రంతో పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత శివకాశి, పోకిరి, కత్తి, పులి, తేరి, బిగిల్, మాస్టర్, బిస్ట్, లియో, తదితర చిత్రాలలో నటించారు. విజయ్ 1999 ఆగస్టు 25న తన వీరాభిమాని అయిన సంగీతని ప్రేమించి వివాహం చేసుకున్నారు .వీరికి కొడుకు సంజయ్, కూతురు దివ్య ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: