మలయాళ నటులలో ఒకరు అయినటువంటి దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలవుతుంది. దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించాడు. ఈయన మొదటగా తెలుగులో మహానటి సినిమాలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని దుల్కర్ సల్మాన్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈయన తెలుగులో నటించిన సీత రామం , లక్కీ భాస్కర్ సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.
ఈ మూవీ ల ద్వారా ఈయన క్రేజ్ తెలుగులో మరింతగా పెరిగిపోయింది. కొంత కాలం క్రితం దుల్కర్ సల్మాన్ "కాంత" అనే సినిమాలో హీరో గా నటించాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... రానా ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. దుల్కర్ సల్మాన్ నటించిన మూడు సినిమాలు తెలుగులో మంచి విజయాలను సాధించడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు కూడా మంచి ఆచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ తెలుగులో పెద్ద ఎత్తున విడుదల అయిన ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ప్లాప్ ను సొంతం చేసుకుంది.
ఈ మూవీ కీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 1.64 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 30 లక్షలు , ఆంధ్ర లో 1.56 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 3.50 కోట్ల షేర్ ... 7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల నష్టాలు వచ్చాయి. దానితో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది.