చికెన్ ఉలవచారు బిర్యానీ ఎలా అంటే...!
తయారీ విధానం ఎలా అంటే... గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి మసాలా దినుసులను వేయించండి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, బిర్యానీ ఆకులు వేసి అవి దోరగా వేగిన తర్వాత రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేయండి. ఆ తర్వాత రెండు నిమిషాలాగి కొద్దిగా పుదీనా, పెరుగు వేసి లీటరున్నర నీళ్లు పోయండి. అప్పుడు నీళ్లు మరిగాక బాస్మతీ బియ్యం, ఉప్పు వేసి ఉడికించండి. ఆ తర్వాత వేరొక గిన్నెలో రెండు టీ స్పూన్లు నూనె వేసి, ఉల్లిపాయ ముక్కల్ని వేయించండి. గోధుమ రంగులోకి అవి వచ్చిన తర్వాత అల్లం వెల్లులి పేస్టు, చికెన ముక్కలు వేయండి.
రెండు నిమిషాలు వేగాక అర లీటరు నీళ్లు పోసి ఉడికించండి. ఆ తరువాత అందులో అర కిలో (తయారుగా ఉన్న) ఉలవచారు వేసి పసుపు, సరిపడినంత ఉప్పు, కారం, వేసి కొంచెం సేపు ఉడికించండి. ఈ ఉలవచారు చికెన కర్రీని ముందుగా తయారు చేసుకున్న బిర్యానిలో కలిపి ఆ తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చాలు ఉలవచారు బిర్యాని రెడీ అయినట్టు.