హెరాల్డ్ స్పెషల్ కర్రీ: ఎంతో రుచికరమైన కొబ్బరిపాలతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా.. !!

Suma Kallamadi
ఆదివారం అంటే చాలు ఇంట్లో ఎదో ఒక నాన్ వెజ్ ఐటమ్ వండాలిసిందే.. కానీ ఎప్పుడు ఒకేలాగా వండితే ఏమి బాగుంటుంది చెప్పండి.వండే కూరలో కొంచెం కొత్తదనం ఉండాలి కదా.. !!అప్పుడే మనం చేసిన కూరకు మంచి మార్కులు పడతాయి. అందుకే ఈసారి సండే ని సరికొత్తగా సెలెబ్రేట్ చేద్దామా..ఈసారి చికెన్ కూరను ఎప్పుడు వండేలాగా కాకుండా కొంచెం వెరైటీగా మాసాల దట్టించి, కొబ్బరిపాలతో వండుదాం.ఇలా వండితే కూర రుచి అమోఘంగా ఉంటుంది.. ఇంకెందుకు ఆలస్యం కొబ్బరి పాలతో చికెన్ కూర ఎలానో చూద్దాం.. !!
కావలిసిన పదార్ధాలు :
1)చికెన్‌ - అరకేజీ
2)కొబ్బరి పాలు - రెండు కప్పులు
3)అల్లం వెల్లుల్లి పేస్టు- సరిపడా
4)గరం మసాల -1 టేబుల్ స్పూన్
5)జీరాపొడి-1 టేబుల్ స్పూన్
6)కారం - 1 స్పూను చొప్పున
7)మిరియాల పొడి - అర స్పూను
8)ఉప్పు - రుచికి సరిపడా
9)పసుపు - పావు స్పూను
10)పచ్చిమిర్చి - 3
11)కరివేపాకు - 8 రెబ్బలు
12)నూనె - పావు కప్పు
13)యాలకులు-1.
14)లవంగాలు - 3 చొప్పున
15)దాల్చినచెక్క - అరంగుళం
16)ఉల్లి తరుగు - ఒక కప్పు
17) మిరియాల పొడి - అర స్పూను
18)మసాల పొడి కోసం: మిరియాలు - 10 దాల్చినచెక్క - అంగుళం, యాలకులు, లవంగాలు - 3 చొప్పున, బిర్యాని ఆకు - 1
తయారుచేసే విధానం:
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో చికెన్‌ వేయాలి అలాగే  అల్లం వెల్లుల్లి, ఉప్పు, గరం మసాల, జీలకర్ర పొడి, పసుపు, ధనియల పొడి,  కారం, మిరియాల పొడులు, పచ్చిమిర్చి తరుగు, ఒక టేబుల్‌ స్పూను నూనె, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, 4 రెబ్బల కరివేపాకు, పావుకప్పు కొబ్బరిపాలు వేసి బాగా కలిపాలి. ఇలా కలిపినా మిశ్రమాన్ని ఒక ఆరు గంటలు పాటు  ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆరు గంటలు అయ్యాక ఫ్రిడ్జ్ లో పెట్టిన మిశ్రమాన్ని తీసి ఒక పది నిముషాలు చల్లదనము పోయేవరకు ఉంచాలి. తరువాత పొయ్యి వెలిగించి కడాయిలో నూనె వేసి మసాల ఉల్లి తరుగు, కరివేపాకు వేసి వేగించాలి. ఉల్లిపాయ ముక్కులు వేగాక కడాయిలో చికెన్‌ మిశ్రమంను వేసి గరిటెతో మెల్లగా తిప్పి మూతపెట్టాలి. ముక్క మెత్తబడి నూనె పైకి తేలాక మిగతా కొబ్బరిపాలు పోసి కూరని ఒకసారి అడుగు అంటకుండా గరిటెతో తిప్పాలి. ఉప్పు కారం చూసుకుని చాలకపోతే కొంచెం వేసుకోవాలి. కర్రీ చిక్కబడ్డాక  కొంచెం మాసాల పొడి వేసి ఒక ఐదు నిముషాలు అయ్యాక కొత్తిమీర చల్లి దించేయాలి.అంతే ఎంతో రుచికరమైన కూర రెడీ అయిపోయినట్లే... !!Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: