వంటా వార్పు: నోరూరించే `కొబ్బరి పాల చికెన్ కర్రీ` ఎలా చేయాలో తెలుసా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
చికెన్- అర‌ కేజీ
టమాటాలు- రెండు
కొబ్బరి పాలు- ఒక‌టిన్న‌ర కప్పు
ఆయిల్- నాలుగు టేబుల్ స్పూన్స్

 

నల్ల మిరిడాల పొడి- అర టీ స్పూన్‌
కరివేపాకు- నాలుగు రెమ్మలు
వెల్లుల్లి- అర‌ టీ స్పూన్

 

ఉల్లిపాయ త‌రుగు- ఒక క‌ప్పు
ఉప్పు- రుచికి త‌గినంత‌
కొత్తిమీర‌- ఒక క‌ట్ట‌

 

త‌యారీ విధానం: ముందుగా చికెన్‌ను నీటితో శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై ప్యాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక చికెన్ ముక్కలు వేసి, ఉప్పు, మిరియాల పొడి వెయ్యాలి. ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. నాలుగు నిమిషాల తర్వాత ఒక కప్పు నీరు, కొబ్బరి పాలు పొయ్యాలి. 

 

తర్వాత టమాటాలు వేసి మూత పెట్టి పావు గంట‌కు పైగా ఉడికించాలి.  మీకు ఎంత చిక్కగా ఉండాలో అంతలా ఉడికించుకోవాలి. ఆ త‌ర్వాత చివ‌రిగా కొత్తిమీర కూడా వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీన్ని స‌ర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే స‌రిపోతుంది. అంతే నోరూరించే కొబ్బరి పాల చికెన్ కర్రీ రెడీ అయిన‌ట్లే. రైస్ లేదా రోటితో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది.

 

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఎప్పుడూ వంటింటి వైపు చూడ‌ని వారు కూడా లాక్‌డౌన్ దెబ్బ‌కు గ‌రెట‌లు ప‌డుతున్నారు. ఏవేవో కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తున్నారు. మ‌రి ఈ లాక్‌డౌన్ టైమ్‌లో మీరు త‌ప్ప‌కుండా రుచి చూడాల్సిన రెసిపీస్‌లో కొబ్బరి పాల చికెన్ కర్రీ కూడా ఒక‌టి. అందుకే త‌ప్ప‌కుండా ఈ రెసిపీని పైన చెప్పిన విధంగా త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి..!!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: