వంటా వార్పు: ఎంతో సులువైన‌ `బచ్చలికూర పచ్చడి`..!!

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
బచ్చలికూర తరుగు- రెండు కప్పులు
చింతపండు- నిమ్మ‌కాయంత‌
జీలకర్ర- అర టీస్పూన్‌
కరివేపాకు- నాలుగు రెబ్బ‌లు

 

శెనగపప్పు- ఒక టీస్పూను
పచ్చిమిర్చి- మూడు
ఉప్పు- రుచికి తగినంత

 

ఆవాలు- అర టీస్పూన్‌
ఎండుమిర్చి- నాలుగు
మినప్పప్పు- ఒక టీస్పూను

 

తయారీ విధానం: ముందుగా పాన్‌లో నూనె వేడి చేసి ఎండుమిర్చి, మినపప్పు, శెనగపప్పు వేసి దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాన్‌లోనే మరికాస్త నూనె పోసి కడిగి ఆరబెట్టుకున్న బచ్చలి కూరను వేసి నీరు ఇగిరే వరకూ మగ్గనివ్వాలి. 

 

ఈ మిశ్రమం చల్లారాక అందులో వేగించి పెట్టుకున్న పోపు, చింత పండు గుజ్జు, ఉప్పు వేసి మిక్సీలో రుబ్బుకోవాలి. ఆ తర్వాత పచ్చడికి తాలింపు పెట్టుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంతో సులువైన‌, రుచిక‌ర‌మైన బచ్చలికూర పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి రైస్‌లో వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: